Dates Processing Method: ఖర్జూర పండ్లు.. ఇవి ఎడారి ప్రాంతంలో మాత్రమే పండుతాయి. ఇవి అత్యంత రుచికరంగా ఉంటాయి. వీటిల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియలో.. జీర్ణ క్రియలో విశేషంగా తోడ్పడుతుంది. అందుకే ఈ ఎడారి ఫలాన్ని తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ఓ నివేదిక ప్రకారం ఎడారి దేశాలు చమురు తర్వాత అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నది ఖర్జూల ఫలాల ద్వారానే. ఖర్జూర చెట్లు ఇసుక నేలల్లో మాత్రమే పెరుగుతాయి. పైగా ఇవి లోటు వర్షపాతం లోనూ కాయలు కాస్తాయి. వీటికి పురుగు మందులు.. నీటి సౌకర్యం కల్పించాల్సిన అవసరం లేదు. వీటి ఆకుల్లో పత్ర రంధ్రాలు తక్కువగా ఉంటాయి కాబట్టి నీటి అవసరం అంతగా ఉండదు. పైగా వీటి వేరు వ్యవస్థ భూగర్భంలోని చాలా లోతులో ఉన్న నీటిని సైతం పీల్చుకుంటుంది.
Also Read: తల్లిదండ్రులు, సోదరుడు చనిపోయారు.. మూడేళ్లుగా ఆ రూం దాటి బయటకు రాలేదు.. ఓ టెకీ విషాద గాథ
ఖర్జూర చెట్లు ఎడారి ప్రాంతంలో మాత్రమే పెరుగుతాయి. ఇక ఎడారి దేశాలలో ప్రత్యేకంగా ఖర్జూర తోటలు సాగు చేస్తుంటారు. ప్రస్తుతం ఎడారి దేశాలలో ఖర్జూర కాయల కోతకాలం మొదలైంది. ఇది సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. అయితే ఖర్జూరాలలో రకరకాల చెట్లు ఉంటాయి. ఈ చెట్ల ఆధారంగానే పండ్ల నాణ్యత ఆధారపడి ఉంటుంది.. పండ్లు కూడా రకరకాలు లభ్యమవుతుంటాయి. ఖర్జూర కాయలు కోసే విధానాన్ని జిదాద్ లేదా అల్ తబ్సీల్ అని పిలుస్తుంటారు. ఏపుగా పెరిగిన చెట్ల నుంచి చకచక్యంగా ఎక్కి కాయలు కోస్తుంటారు. ఆ కాయలను ప్రత్యేకమైన వాహనంలో ఒక ప్రాంతానికి తరలిస్తారు. ఆ తర్వాత కాయలను ఆరబెడతారు. ఆరిన తర్వాత వాటిని ప్రత్యేకమైన ద్రావణం లో ముంచుతారు. ఆ తర్వాత మళ్లీ వాటిని ఆరబెడతారు. కాయ ముదురు ఎరుపు వర్ణంలోకి వచ్చిన తర్వాత.. వాటిని ప్యాక్ చేస్తారు.
Also Read: టూరిజంలో కొత్త ధోరణి.. మారుతున్న యువత ఆలోచన తీరు!
ఖర్జూర కాయల నాణ్యత ఆధారంగా గ్రేడింగ్ చేస్తారు. ఎక్కువ నాణ్యత ఉన్న పండ్లకు ఒక రకమైన ధర.. రెండవ శ్రేణి పండ్లకు మరొక ధర.. తృతీయ శ్రేణి పండ్లకు ఇంకొక ధర నిర్ణయిస్తారు. అయితే ఒమన్ ప్రాంతంలో పండే ఖర్జూర పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో వీటికి ఏడాది పాటు గిరాకీ ఉంటుంది. ప్రస్తుతం ఒమన్ దేశంలో ఖర్జూర పంట కోత మొదలైంది. ఇక్కడ ఏపుగా పెరిగిన తోటల్లో ఖర్జూర కాయలను కోస్తున్నారు. ప్రత్యేకమైన పద్ధతిలో వాటిని కోసి.. కాయలను షెడ్డు కు తరలిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో చెట్టు నుంచి గెల కిందపడటం లేదు. పైగా ప్రత్యేకమైన తాళ్ళను ఏర్పాటు చేసి.. గెలలు కోస్తున్నారు. ఆ గెలలు కూడా చూడ్డానికి చాలా పెద్దగా ఉన్నాయి. సాధారణంగా చాలామంది ఖర్జూర పండ్లు చెట్టు మీదనే పండుతాయి అనుకుంటారు. కానీ కాయలు పక్వానికి వచ్చిన తర్వాత వాటిని కోయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని ప్రత్యేకమైన పద్ధతిలో పండించాల్సి ఉంటుంది. అయితే ఖర్జూర పండ్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో అనేక కృత్రిమ పద్ధతులను తయారీదారులు అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది.