Traffic Fine Solution: ఈరోజుల్లో ప్రతిదీ డిజిటల్ మాయమైపోతుంది. ఏదైనా జాబ్కు అప్లై చేయాలన్న.. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా.. ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. మ్యానువల్గా చాలావరకు అప్లై చేయడం తగ్గిపోయింది. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన పత్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందికి గురవుతాము. కానీ ముఖ్యమైన పత్రాలను ఎప్పుడూ దగ్గరే ఉంచుకునే అవకాశం ఉండదు. అయితే వాటిని ఫోన్లో ఫోటో ఉంచుకుంటే పర్వాలేదు. కానీ ఇవి అంతా క్లారిటీగా ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో కొన్ని పత్రాలు ఆన్లైన్లో పొందుపరచుకోవడం వల్ల అవసరం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి ఆన్లైన్లో ఉండడంవల్ల భారీగా ఫైన్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ధ్రువపత్రాలు ఆన్లైన్లో ఉంచుకోవడానికి కొన్ని యాప్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఈ నాలుగు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
Also Read: Traffic Challans: తస్మాత్ జాగ్రత్త: మీ వాహనాలపై డేగ కన్ను
వీటిలో మొదటిది m parivahan app. ఈ యాప్ ద్వారా మన వాహనానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు ఇందులో పొందుపరచుకోవచ్చు. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి, పొల్యూషన్, ఇన్సూరెన్స్ తదితర అన్ని సర్టిఫికెట్లు ఇందులో ఉంటాయి. వాహనాలపై ప్రయాణించే సమయంలో పాకెట్లో ఈ పత్రాలన్నీ ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో ఈ యాప్ ద్వారా ట్రాఫిక్ పోలీసులకు వివరాలు అందిస్తే వారు ఏ విధంగానూ అభ్యంతరం చెప్పారు. అంతేకాకుండా ఇది ప్రభుత్వ యాప్ కావడంతో అధికారికంగానే ఇవి చెల్లుబాటు అవుతాయి.
రెండో యాప్ వివరాల్లోకి వెళితే.. మొబైల్లో కచ్చితంగా DigiYatra అనే యాప్ ఉండాలి. నేటి కాలంలో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. బస్టాండ్లో కంటే ఎయిర్పోర్టులో క్యూ ఎక్కువగా ఉంటుంది. బోర్డింగ్ పాస్ చెక్ చేసుకోవడానికి.. వివరాలు తెలపడానికి ఈ క్యూను భరించాల్సి ఉంటుంది. అయితే Digi Yatra యాప్ మొబైల్లో ఉంటే ఈ క్యూ భరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యాప్ లో బోర్డింగ్ సంబంధించిన వివరాలన్నీ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఫేస్ రికగ్నైసేడ్ ద్వారా వివరాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఎయిర్పోర్ట్లోకి వెళ్లిన తర్వాత డిజి యాత్ర క్యూ తక్కువగా ఉంటుంది. ఈ క్యూలో కేవలం మొబైల్ కు సంబంధించిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే వివరాలన్నీ ఎయిర్పోర్ట్ సిబ్బందికి తెలిసిపోతుంది. దీంతో చాలా సమయం ఆదా చేసుకోవచ్చు.
మరో ఉపయోగకరమైన యాప్ Digi Locker. ఈ యాప్ లో ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను భద్రపరుచుకోవచ్చు. టెన్త్ సర్టిఫికెట్ నుంచి డిగ్రీ సర్టిఫికెట్ వరకు అన్ని ఇందులో ఆటోమేటిగ్గా అప్డేట్ అవుతాయి. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వెంట తీసుకెళ్లకుండా.. ఈ యాప్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఇవి సెక్యూరిటీ కోడ్ తో ఉంటాయి కాబట్టి ఇతరులకు తెలిసే అవకాశం అసలు ఉండదు. అందువల్ల ఈ యాప్ ను మొబైల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
చివరిగా మరో ప్రభుత్వ యాప్ RBI retail directly app. ఈ యాప్ ద్వారా నేరుగా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి బ్యాంకు కంటే ఎక్కువగా రిటర్న్స్ వస్తాయి. అంతేకాకుండా ఎలాంటి బ్రోకరిజం లేకుండా నేరుగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎలాంటి సమస్య ఉండదు. అందువల్ల ఈ యాప్ను కూడా మొబైల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.