Homeజాతీయ వార్తలుTraffic Challans: తస్మాత్ జాగ్రత్త: మీ వాహనాలపై డేగ కన్ను

Traffic Challans: తస్మాత్ జాగ్రత్త: మీ వాహనాలపై డేగ కన్ను

Traffic Challans: మీకు బైక్ ఉందా? హెల్మెట్ పెట్టుకోకుండానే దానిపై రయ్యిమంటూ దూసుకెళ్తారా? ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టానుసారంగా డ్రైవ్ చేస్తారా? ఇకనుంచి మీరు అలా చేయకండి. ఎవరూ చూడడం లేదు కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తించకండి. ఎందుకంటే మీ వాహనాలపై డేగ కన్ను ఉంది. మీ తప్పుల్ని ఎంచుతుంది. ఈ_ చలానాలు తీసి మీ ఇంటికి పంపించి ముక్కు పిండి మరీ వసూలు చేస్తుంది. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ను పాటించకుండా విచ్చలవిడిగా వాహనాలను నడుపుతుండడంతో పోలీస్ శాఖ డిస్ట్రిబ్యూటెడ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టం అనే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. వాస్తవానికి హైదరాబాద్ సహా అని నగరాల్లో బండిపై హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తూనో, రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తున్నప్పుడో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారా లేదా అని గమనిస్తూ పోతుంటారు చాలామంది. ఎందుకంటే ఎక్కడ ఫోటో తీసి చాలానా పంపిస్తారనే భయమే ఇందుకు కారణం. ఇక పట్టణాల విషయానికొస్తే హెల్మెట్, ఇతర రూల్స్ విషయంలో ట్రాఫిక్ పోలీసులు పెద్దగా పట్టించుకోరు. పోలీసులు ఇచ్చిన వెసలుబాటును అలుసుగా తీసుకొని చాలామంది వాహనదారులు రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటారు. ఇకపై వీరి ఆటలు సాగవు. డిస్ట్రిబ్యూటెడ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా, ఎక్కడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్గా అక్కడున్న సీసీ కెమెరాలు ఫోటోలు తీసి హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పంపిస్తాయి. ఇక్కడి నుంచే వాహనదారులకు చలాన్లు జారీ అవుతాయి.

Traffic Challans
Traffic Challans

తొలుత రామగుండం కమిషనరేట్ లో

సీసీ కెమెరాల ద్వారా ఈ చలాన్ విధానాన్ని త్వరలో రామగుండం పోలీస్ కమిషనరేట్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం కమిషనరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మంచిర్యాలలో 205, పెద్దపల్లిలో 64, గోదావరిఖనిలో 32 సీసీ కెమెరాలు అమర్చారు. వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించారు. ఈ సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సీసీ కెమెరాలను డిస్ట్రిబ్యూటెడ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టంతో కనెక్ట్ చేయడంతో సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గుతుందని పోలీసు వర్గాలు అంటున్నాయి. హెల్మెట్ ధరించకున్నా, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంప్ చేసినా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా ఆటోమెటిక్ గా సీసీ కెమెరాల ద్వారా ఈ చలాన్ జనరేట్ అవుతుందని పోలీసు వర్గాలు అంటున్నాయి.

Traffic Challans
Traffic Challans

రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే

తెలంగాణలో ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల వేలాది మంది చనిపోతున్నారు. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యపు డ్రైవింగ్. ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ ఎన్ని విధానాలు చేపట్టినా ఆశించినంత మేర ఫలితం ఉండటం లేదు. పైగా ట్రాఫిక్ విధుల్లో ఉంటున్న సిబ్బందికి శ్వాస కోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఈ క్రమంలో టెక్నాలజీ ద్వారా రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే సీసీ కెమెరాలు ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను నిరోధించాలని అధునాతన డిస్ట్రిబ్యూటెడ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టం తెరపైకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ విధానాన్ని రామగుండంలో ప్రయోగాత్మకంగా చేపట్టి.. అది విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని పోలీస్ శాఖ యోచిస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular