2020లో రూ.20 వేల లోపు టాప్ 10 స్మార్ట్ ఫోన్లు ఇవే..!

దేశంలోని యువత, విద్యార్థుల్లో స్మార్ట్ ఫోన్లకు ఫుల్ క్రేజ్ ఉంది. స్మార్ట్ ఫోన్ల కంపెనీలు కొత్తకొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లో లాంఛ్ చేస్తూ యూజర్లకు మరింత చేరువవుతున్నాయి. అన్ని ప్రముఖ బ్రాండ్ల కంపెనీలు ఈ ఏడాది స్మార్ట్ ఫోన్లను లాంఛ్ చేసినా కొన్ని ఫోన్లు మాత్రమే కస్టమర్లకు కెమెరా, బ్యాటరీ, డిస్ ప్లే, పెర్ఫామెన్స్ విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తిని కలిగించాయి. అలా పెట్టిన ఖర్చుకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన టాప్ 10 స్మార్ట్ […]

Written By: Kusuma Aggunna, Updated On : December 23, 2020 11:20 am
Follow us on


దేశంలోని యువత, విద్యార్థుల్లో స్మార్ట్ ఫోన్లకు ఫుల్ క్రేజ్ ఉంది. స్మార్ట్ ఫోన్ల కంపెనీలు కొత్తకొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లో లాంఛ్ చేస్తూ యూజర్లకు మరింత చేరువవుతున్నాయి. అన్ని ప్రముఖ బ్రాండ్ల కంపెనీలు ఈ ఏడాది స్మార్ట్ ఫోన్లను లాంఛ్ చేసినా కొన్ని ఫోన్లు మాత్రమే కస్టమర్లకు కెమెరా, బ్యాటరీ, డిస్ ప్లే, పెర్ఫామెన్స్ విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తిని కలిగించాయి. అలా పెట్టిన ఖర్చుకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన టాప్ 10 స్మార్ట్ ఫోన్లు ఇవే!

Also Read: కస్టమర్లకు అమెజాన్ శుభవార్త.. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..?

1. పోకో ఎక్స్ 3

పోకో లాంఛ్ చేసిన ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 64 జీబీ మెమొరీతో ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర రూ.16,999 కాగా బ్యాంకు ఆఫర్లను ఉపయోగించి తక్కువ ధరకే ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. కోబాల్ట్ బ్లూ, షాడో గ్రే కలర్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం వల్ల ఈ ఫోన్ ను కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

2. రియల్ మీ 7 ప్రో

రియల్ మీకి చెందిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ.19,999కు అందుబాటులో ఉంది. స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ తో పని చేసే ఈ ఫోన్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. మిర్రర్ బ్లూ, మిర్రర్ సిల్వర్, సన్ కిస్డ్ లెథర్ కలర్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. తక్కువ ధరలో రియల్ మీ ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ పర్ఫెక్ట్ ఛాయిస్.

3. శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్

శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్ ఫోన్ ధర రూ.19,499గా ఉంది. 6జీబీ ర్యామ్, 128 జీబీతో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ కు మేజర్ ప్లస్ పాయింట్. ఆండ్రాయిడ్ 10.0 వెర్షన్ పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది.

4. మోటొరోలా వన్ ఫ్యూజన్ ప్లస్

5,000 ఎంఏఎచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న మోటొరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ ధర కేవలం రూ.17,499 మాత్రమే. మూన్ లైట్ వైట్, ట్విలైట్ బ్లూ కలర్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్ పై పని చేసే ఈ ఫోన్ ఫుల్ హెచ్డీ డిస్ ప్లేను కలిగి ఉంది. 64 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరాను కలిగి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత.

5. రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫీచర్లను అందిస్తున్న రెడ్ మీ సంస్థ రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ధర రూ.15,999 నుంచి అందుబాటులోకి తెచ్చింది. 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ ప్లేను కలిగి ఉన్న ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ పై పని చేస్తుంది. 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 6. రియల్ మీ 6 ప్రో

రియల్ మీ తాజాగా లాంఛ్ చేసిన స్మార్ట్ ఫోన్లలో రియల్ మీ 6 ప్రో కూడా ఒకటి. రూ.17,999 రూపాయల నుంచి ప్రారంభమయ్యే ఈ స్మార్ట్ ఫోన్ అదిరిపోయే ఫీచర్లను కలిగి ఉంది. స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ పై పని చేసే ఈ స్మార్ట్ ఫోన్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ ఇన్ డిస్ ప్లే సెల్ఫీ ఫీచర్ తో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

7. పోకో ఎక్స్ 2

పోకో లాంఛ్ చేసిన ఈ ఫోన్ 17,499 రూపాయలకు మార్కెట్ లో అందుబాటులో ఉంది. మ్యాట్రిక్స్ పర్పుల్, అట్లాంటిస్ బ్లూ, ఫియోనిక్స్ రెడ్ కలర్స్ లో అందుబాటులో ఉంది. 6.67 ఫుల్ హెచ్డీ డిస్ ప్లేతో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేసే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్ తో పని చేస్తుంది.

Also Read: స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ ను పెంచే ట్రిక్స్ ఇవే..?

8. శాంసంగ్ గెలాక్సీ ఎం31

సాంసంగ్ గెలాక్సీ ఎం31 స్మార్ట్ ఫోన్ 6జీబీ ర్యామ్, 64జీబీ మెమెరీతో పని చేస్తుంది. ఐస్ బర్గ్ బ్లూ, బ్లాక్, బ్లూ కలర్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 6.4 ఇంచ్ ఫుల్ ఇంటెన్సిటీ డిస్ ప్లేతో తయారైన ఈ ఫోన్ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.

9. రియల్ మీ ఎక్స్ 2

4జీబీ ర్యామ్, 64 జీబీ మెమొరీతో పని చేసే రియల్ మీ ఎక్స్ 2 స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్ తో పని చేస్తుంది. 6.4 ఫుల్ హెచ్డీ డిస్ ప్లేను కలిగి ఉన్న ఈ ఫోన్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడైన ఫోన్ లలో రియల్ మీ ఎక్స్ 2 ముందువరసలో ఉంది.

10. వివో వీ17

వివో 8జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్లతో కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చిన వివో వీ17 ఐవ్యూ డిసె ప్లే, 32 మెగా పికెల్ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేసే ఈ ఫోన్ 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ ప్లేను కలిగి ఉంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం