కస్టమర్లకు అమెజాన్ శుభవార్త.. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..?

ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ ఇయర్ ఎండ్ నేపథ్యంలో కస్టమర్లకు మరో శుభవార్త చెప్పింది. స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై ఏకంగా 40 శాతం డిస్కౌంట్లను ప్రకటించడం గమనార్హం. అమెజాన్ లో ఇప్పటికే ఈ సేల్ ప్రారంభం కాగా క్రిస్మస్ పండుగ రోజైన డిసెంబర్ 25వ తేదీ వరకు ఈ సేల్ ఉంటుంది. Also Read: 2020లో […]

Written By: Navya, Updated On : December 23, 2020 11:14 am
Follow us on


ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ ఇయర్ ఎండ్ నేపథ్యంలో కస్టమర్లకు మరో శుభవార్త చెప్పింది. స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై ఏకంగా 40 శాతం డిస్కౌంట్లను ప్రకటించడం గమనార్హం. అమెజాన్ లో ఇప్పటికే ఈ సేల్ ప్రారంభం కాగా క్రిస్మస్ పండుగ రోజైన డిసెంబర్ 25వ తేదీ వరకు ఈ సేల్ ఉంటుంది.

Also Read: 2020లో రూ.20 వేల లోపు టాప్ 10 స్మార్ట్ ఫోన్లు ఇవే..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నింటిపై అమెజాన్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కొన్ని కంపెనీలు స్మార్ట్ ఫోన్లపై అడిషనల్ ఎక్స్ ఛేంజ్ ఆఫర్లను కూడా ఇస్తుండటం గమనార్హం. స్మార్ట్ ఫోన్లతో పాటు ఎలక్ట్రిక్ వస్తువులపై కూడా ఈ సేల్ లో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా షాపింగ్ చేస్తే 10 శాతం అడిషనల్ డిస్కౌంట్ లభిస్తుంది. పలు స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై నో కాస్ట్ ఈ.ఎం.ఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Also Read: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.25 వేలకే రూ.70 వేల ఫోన్…?

దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లలో ఒకటైన్ రెడ్ మీ స్మార్ట్ ఫోన్లపై ఏకంగా 3,500 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ల ధర మరింత తగ్గే అవకాశం ఉంటుంది. కొత్తగా స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వాళ్లు అమెజాన్ ద్వారా స్మార్ట్ ఫోన్ ఈ సేల్ లో భాగంగా కొనుగోలు చేస్తే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లభిస్తుందని చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

శాంసంగ్ గెలాక్సీ ఎం51, గెలాక్సీ ఎం31 ప్రైమ్ ఎడిషన్, గెలాక్సీ ఎం21, వన్ ప్లస్ 7టి సిరీస్, వన్ ప్లస్ 8టీ సిరీస్, ఐఫోన్ 7, ఐఫోన్ 11, వివో, ఒప్పో ఫోన్లపై అమెజాన్ సంస్థ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అమెజాన్ సేల్ లో నోకియా, హానర్ ఫోన్లపై 2,000 రూపాయల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.