బైడెట్ టీంలోకి మరో ఇద్దరు భారతీయులకు చోటు

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నాడు. తన టీమ్ లో మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు చోటు కల్పించారు. అధ్యక్ష కార్యాలయ సిబ్బంది డిప్యూటీ డైరెక్టర్ గా గౌతమ్ రాఘవన్, స్పీచ్ రైటింగ్ డైరెక్టర్ గా వినయ్ రెడ్డి పేర్లను మంగళవారం ఖరారు చేశారు. ఇప్పటికే కమలా హారిస్ ను ఉపాధ్యక్షురాలిగా, నీరా టాండన్ ను బడ్జెట్ చీఫ్ గా, వేదాంత్ పటేల్ ను వైట్ హౌజ్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రెటరీగా బాధ్యతలు […]

Written By: Velishala Suresh, Updated On : December 23, 2020 9:25 am
Follow us on

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నాడు. తన టీమ్ లో మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు చోటు కల్పించారు. అధ్యక్ష కార్యాలయ సిబ్బంది డిప్యూటీ డైరెక్టర్ గా గౌతమ్ రాఘవన్, స్పీచ్ రైటింగ్ డైరెక్టర్ గా వినయ్ రెడ్డి పేర్లను మంగళవారం ఖరారు చేశారు. ఇప్పటికే కమలా హారిస్ ను ఉపాధ్యక్షురాలిగా, నీరా టాండన్ ను బడ్జెట్ చీఫ్ గా, వేదాంత్ పటేల్ ను వైట్ హౌజ్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. కాగా వీరిలో గత ఒబామా ప్రభుత్వంలో పనిచేసిన వారున్నారు. నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ 306 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా, ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ 232 ఎలక్టోరల్ ఓట్లు పొందాడు. వచ్చే నెలలో అమెరికా ప్రభుత్వం ఏర్పడనుంది.