Jabardasth: జబర్దస్త్ టీంలో విషాదం నెలకొంది. ఇందులోని ఓ నటుడు ఆకస్మికంగా మరణించారు. జబర్దస్త్ ప్రొగ్రాంకు వస్తుండగా రైలు పట్టాల మధ్య ఇరుక్కుని మరణించారు. దీంతో ఆయన కుటుంబంతో పాటు జబర్దస్త్ లోని తన తోటి నటులు ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఎలా చనిపోయాడు? ఆ వివరాల్లోకి వెళితే..
జబర్దస్త్ ప్రొగ్రాం ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ఇందులో నటించిన వారు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. కొందరు హీరో, హీరోయిన్లుగా రాణిస్తూ ఆకట్టుకున్నారు. జబర్దస్త్ ప్రొగ్రాంలోకి నటులు వస్తుంటారు.. పోతుంటారు..ఈ ప్రొగ్రాం నిర్వాహకులు ఎక్కువగా కొత్తవాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు. ఇటీవల కొంత మంది కొత్త వాళ్లు వచ్చి తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. వీరిలో మహ్మద్దీన్ ఒకరు. మహ్మద్దీన్ జబర్దస్త్ లో 50 ఎపిసోడ్ లో కనిపించి పాపులర్ అయ్యారు. కానీ ఆయన ఆకస్మిక మరణం తీరని విషాదాన్ని కలిగించింది.
మహ్మద్దీన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యక్తి. ఈ జిల్లాలోని చుంచుపల్లి మండలం నందా తండాలో మహ్మద్దీన్ జీవిస్తున్నాడు. జబర్దస్త్ లో ఆయనకు అవకాశం రావడంతో ట్రైన్ ద్వారా హైదరాబాద్ కు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో జూన్ 21 శుక్రవారం జబర్దస్త్ షూటింగ్ కోసం భద్రచలం రోడ్ రైల్వేస్టేషన్ కు వచ్చాడు. కాకతీయ ఎక్స్ ప్రెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే ఈ ట్రైన్ కదులుతుండగా మహ్మద్దీన్ ఎక్కాడు. అయితే ప్రమాదవశాత్తూ కాలుజారీ ప్లాట్ ఫాం, ట్రైన్ మద్య ఇరుక్కున్నాడు.
దీంతో వెంటనే ట్రైన్ లోని వ్యక్తి చైన్ లాగడంతో లోకో ఫైలట్ ట్రైన్ ను ఆపాడు. రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని మహ్మద్దీన్ ను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే మహ్మద్దీన్ మరణించడం విషాదం నెలకొంది. మహ్మద్దీన్ కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబానికి అండగా ఉన్న మహ్మద్దీన్ మరణంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ఇదిలా ఉండగా తోటి నటుడు మరణించడంతో జబర్దస్త్ టీంలో విషాదం నెలకొంది.