Arattai vs WhatsApp: సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సృష్టించిన సంచలనాలు మామూలువికావు. దీనివల్ల సాంకేతిక రంగంలో అనేక మార్పులు వచ్చాయి.. మొదట్లో మెసేజ్ యాప్ లాగా పరిచయమైన వాట్సప్ ఆ తర్వాత అనేక మార్పులకు గురైంది. కొంతకాలానికి రకరకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక వినియోగదారులు ఉన్న సోషల్ మెసేజింగ్ యాప్ గా వాట్సప్ అవతరించింది. ఓ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నాలుగు బిలియన్లకు మించిన వినియోగదారులు వాట్సాప్ కు ఉన్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వాట్సాప్ మాదిరిగా ఎన్నో యాప్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. అవేవీ కూడా దానిని బీట్ చేయలేకపోయాయి. అయితే ఇప్పుడు అరట్టై వాట్సాప్ కు పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. వాట్సాప్ కు మించి సదుపాయాలను కల్పిస్తున్న నేపథ్యంలో అరట్టై సరికొత్తగా కనిపిస్తోంది. పైగా ఇది జోహో అనే ఇండియా కంపెనీ రూపొందించింది. ఇటీవల కాలంలో అమెరికా ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో స్వదేశీ మంత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపిస్తున్నారు. దీనికి తోడు ఈ యాప్ ను ఏకంగా కేంద్ర మంత్రి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో యూజర్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది..అరట్టై పేరుకు ఇది ఇండియన్ యాప్ అయినప్పటికీ.. అనేక సౌలభ్యాలను యూజర్లకు కల్పిస్తోంది. ఇంతకీ ఈ యాప్ లో ఉన్నవి.. వాట్సప్ లో లేనివి ఏవంటే..
సందేశాలను స్టోర్ చేసుకోవచ్చు
ఒకప్పుడు అందరికీ ఒకేసారి సందేశాలను పంపించాలంటే వాట్సాప్ లో గ్రూప్ ఏర్పాటు చేసుకునేవారు. ఆ తర్వాత వాట్సప్ సెల్ఫ్ మెసేజ్ అనే ఫీచర్ అందుబాటులో తీసుకొచ్చింది. దీని నోట్స్ లో కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ అవసరాన్ని గుర్తించిన అరట్టై.. పాకెట్ అనే ప్రత్యేక సౌలభ్యాన్ని అందుబాటులో తీసుకొచ్చింది.. పాకెట్ అనేది క్లౌడ్ స్టోరేజ్ లాంటిది. ముఖ్యమైన సందేశాలను ఇందులో భద్రంగా ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సిస్ కూడా చేసుకోవచ్చు. ఇతర సామాజిక మాధ్యమాల నుంచి ముఖ్యమైన ఫైల్స్ కూడా ఇందులో పంపవచ్చు. అంతేకాదు నోట్ గా కూడా ఉపయోగించవచ్చు. ఎటువంటి డివైస్ నుంచి అయినా సరే దీనిని యాక్సిస్ చేయవచ్చు.
మీటింగ్ లోనూ వీడియో కాల్
సాధారణంగా చాలామంది మీటింగ్ అనగానే గూగుల్ మీట్ లేదా జూమ్ ను వాడుతుంటారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని అరట్టై మీటింగ్ అనే పేరుతో సదుపాయాన్ని తీసుకొచ్చింది. గడిచిన మీటింగ్స్.. వచ్చే మీటింగ్స్.. భవిష్యత్తు కాలంలో చేసుకోవాలనుకున్న మీటింగ్స్ మొత్తాన్ని షెడ్యూల్ చేసుకుని అవకాశం కల్పించింది. ఈ ఫీచర్ ను సులువుగా యాక్సిస్ చేసుకోవచ్చు.
మెన్షన్
వాట్సాప్ గ్రూప్ లలో ఎవరైనా మనల్ని మెన్షన్ చేస్తే వెంటనే కనిపిస్తుంది. ఒకవేళ ఆ గ్రూప్ చూడకుండా పక్కన పెడితే.. వచ్చే సందేశాల వల్ల ఆ మెన్షన్ ను చూసే అవకాశం ఉండదు.అరట్టై లో మాత్రం మనల్ని మెన్షన్ చేసిన ప్రతి సందేశానికి బదులు ఇవ్వవచ్చు.
ప్రకటనలు ఉండవు
వాట్సప్ మన డాటా ను టార్గెట్ అడ్వర్టైజింగ్ కు ఉపయోగిస్తుంది.. అంతేకాదు స్థానిక డేటా సెంటర్లోనే యూజర్ల డాటాను స్టోర్ చేస్తుంది. వాయిస్, వీడియో కాల్స్ మొత్తం పూర్తిగా ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి. యూజర్ల డాటా విషయంలో అరట్టై మెయిన్ డాటా సెంటర్లో స్టోర్ చేస్తోంది. అంతేకాదు యూజర్ల సమాచారాన్ని ఎక్కడ కూడా విక్రయించదు. ఇక టెక్స్ట్ తో సహా వాయిస్, వీడియో కాల్స్, ఎండ్ టు ఎండ్ ఇన్క్రిప్షన్ అవకాశం అరట్టై కల్పిస్తోంది.
కృత్రిమ మేధ
ఇటీవల వాట్సప్ మాతృ సంస్థ మెటా కృత్రిమ మేధను ఉపయోగించి సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. ప్రారంభంలో యూసర్లు దీనిపై అంతగా ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించారు..అరట్టై లో కృత్రిమ మేధ లేకపోవడంతో ఈ యాప్ అనేది డిఫరెంట్ గా ఉంది. ఈ ఐదు కారణాలు అరట్టై కి అడ్వాంటేజ్ అని చాలామంది చెబుతున్నారు. ఇప్పటికే యూజర్లు 50 లక్షలకు పైగా మంది అయ్యారని.. యూజర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని అరట్టై మాతృ సంస్థ జోహో చెబుతోంది.