https://oktelugu.com/

Instagram Teen account :  టీనేజర్లకు ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో టీన్ అకౌంట్.. త్వరలో రాబోతున్న కొత్త ఫీచర్

ఇకపై ఎవరైనా 18 ఏళ్ల లోపు వాళ్లు ఇన్‌స్టాలో ఖాతా తెరిస్తే వాళ్లకు టీన్ అకౌంట్ ఇస్తారు. అయితే ఇప్పటికీ ఉన్న టీనేజర్ల ఖాతాలను 60 రోజుల్లో టీన్ అకౌంట్లుగా మారుస్తామని మెటా తెలిపింది. ఈ టీన్ అకౌంట్స్ తీసుకురావడానికి ముఖ్య కారణం పిల్లలకు చెందిన విషయాలను భద్రతగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 19, 2024 / 05:38 PM IST

    Instagram Teen account

    Follow us on

    Instagram Teen account: ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. పెద్ద వాళ్ల నుంచి చిన్న పిల్లల వరకు అందరూ కూడా ఎక్కవగా సోషల్ మీడియాకి బానిస అవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు సోషల్ మీడియాకి బాగా అలవాటు పడి వాళ్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెటా కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవాళ్ల కోసం స్పెషల్‌గా టీన్ అకౌంట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కేవలం పిల్లల సురక్షితం కోసమేనని తెలిపింది. అయితే కొత్త విధానం అనేది యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాల్లో మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. ఇకపై ఎవరైనా 18 ఏళ్ల లోపు వాళ్లు ఇన్‌స్టాలో ఖాతా తెరిస్తే వాళ్లకు టీన్ అకౌంట్ ఇస్తారు. అయితే ఇప్పటికీ ఉన్న టీనేజర్ల ఖాతాలను 60 రోజుల్లో టీన్ అకౌంట్లుగా మారుస్తామని మెటా తెలిపింది. ఈ టీన్ అకౌంట్స్ తీసుకురావడానికి ముఖ్య కారణం పిల్లలకు చెందిన విషయాలను భద్రతగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

    టీన్ అకౌంట్లు వాళ్ల తల్లిదండ్రుల కంట్రోల్‌లో ఉంటాయి. టీనేజర్ల అకౌంట్‌లు ఆటోమెటిక్‌గా ప్రైవేట్ అకౌంట్‌గా ఉంటాయని తెలిపింది. కొత్తగా వాళ్లు ఎవరి మెసేజ్‌లను యాక్సెప్ట్ చేస్తేనే అవుతుంది. ఇంతకు ముందు ఫాలో అయిన వాళ్లు నుంచి యథావిధిగా మెసేజ్‌లు వస్తాయి. ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏవైనా సెట్టింగ్‌లు మార్చుకోవాలంటే తప్పకుండా తల్లిదండ్రుల అనుమతి అనేది ఉండాలి. అప్పుడే వాళ్లు సెట్టింగ్స్‌ను మార్చుకోగలరు. ప్రైవేట్ అకౌంట్స్‌ను ఫాలో అయితేనే వాళ్ల కంటెంట్‌ను చూడగలం. అలాగే టీన్ అకౌంట్ ఉన్న వాళ్ల కంటెంట్‌ను చూడాలనుకుంటే.. వాళ్లను ఫాలో కావాలి. అది ఆ రిక్వెస్ట్‌ను వాళ్లు ఒప్పుకుంటేనే చూడగలరు. ఇన్‌స్టాలో కనెక్ట్ ఉన్నవాళ్ల మెసేజ్‌లు మాత్రమే వస్తాయి. ఈ టీన్ అకౌంట్లకు సెన్సిటివ్ కంటెంట్‌ నుంచి కాస్త కంట్రోల్ ఉంటుంది. ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే ఆటోమెటిక్‌గా ఇన్‌స్టా వాటిని తీసేస్తుంది. గంట కంటే ఎక్కువగా టీనేజర్లు ఇన్‌స్టా యాప్ వాడితే తప్పకుండా వాళ్లకు మెసేజ్ వస్తుంది. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఇన్‌స్టాలో స్లీప్ మోడ్ ఆన్‌లో ఉంటుంది. ఈ సమయంలో మెసేజ్‌లు రావు. వీటికి కూడా ఆటోమెటిక్‌గా రిప్లే వెళ్తుంది. తల్లిదండ్రులు పిల్లల చాట్‌లను చూడవచ్చు. అలాగే కొంత సమయం యాప్ వాడకుండా బ్లాక్ కూడా చేయవచ్చు. జనవరికి ప్రపంచ వ్యాప్తంగా ఈ టీన్ అకౌంట్లను తీసుకొస్తామని మెటా చెబుతోంది. మొదట యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అమలు చేయనుంది. ఇలా చేయడం వల్ల పిల్లల భద్రతను కాపాడవచ్చని, వాళ్ల భవిష్యత్తు కూడా బాగుపడుతుందని మెటా ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఈ టీన్ అకౌంట్లు వచ్చిన తర్వాత అయిన కూడా టీనేజర్లకు సమస్యలు తప్పుతాయి ఏమో చూడాలి.