Rishabh Pant : చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ ముందుగా బ్యాటింగ్ మొదలుపెట్టింది. ప్రారంభంలోనే మూడు వికెట్లను నష్టపోయింది. గిల్ 0 పరుగులకు ఔట్ కాగా.. కెప్టెన్ రోహిత్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆరు పరుగులు మాత్రమే చేసి, పెవిలియన్ చేరుకున్నారు. దీంతో స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తొందరగానే బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. గత ఏడాది కంటే ముందు రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలి ఐపిఎల్ ద్వారా అతడు క్రికెట్లో రీ ఎంట్ర ఇచ్చాడు. 2022లో బంగ్లాదేశ్ చెట్టుతో తన చివరి టెస్ట్ ఆడాడు. రెండు సంవత్సరాల విరామం తర్వాత టెస్ట్ క్రికెట్లోకి అతడు రీ ఎంట్రీ ఇచ్చాడు.
సుదీర్ఘ విరామం తర్వాత
క్రీజ్ లోకి వచ్చిన తర్వాత రిషబ్ పంత్.. బంగ్లాదేశ్ కీపర్ లిటన్ దాస్ తో గొడవపడ్డాడు. అహ్మద్ వేసిన 16 ఓవర్లో ఈ సంఘటన జరిగింది. 16 ఓవర్ మూడో బంతిని యశస్వి జైస్వాల్ పాయింట్ దిశగా ఆడాడు. దీంతో క్విక్ సింగిల్ తీయడానికి యత్నించాడు. అయితే ఆ బంతిని ఫీల్డ్ అందుకోవడంతో వెనక్కి వచ్చాడు. అయితే అతడు రిషబ్ పంత్ కాళ్లకు బంతిని విసిరాడు. అది అతడి ప్యాడ్లను తాకి దూరంగా వెళ్లిపోయింది. దీంతో దాన్ని ఓవర్ త్రో గా భావించి పంత్ వెంటనే సింగిల్ రన్ తీశాడు. అయితే ఇది సరికాదని లిటన్ దాస్ పంత్ తో వాగ్వాదానికి దిగాడు. బంతి ప్యాడ్స్ ను మిగిలిన తర్వాత సింగిల్ ఎలా తీస్తారు అంటూ.. ఇది క్రికెట్ నిబంధనలకు వ్యతిరేకమని అన్నాడు. వాస్తవానికి బంతి ప్యాడ్స్ తగిలినప్పటికీ బ్యాటర్లు సింగిల్ తీయడానికి ఇష్టపడరు. ఇది నిబంధన కాకపోయినప్పటికీ.. బ్యాటర్లు ఆ విధానాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇదే సమయంలో బంతిని స్టంప్స్ వైపు కాకుండా తనకాళ్లను లక్ష్యంగా చేసుకొని విసరడం పట్ల పంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కాళ్ళను లక్ష్యంగా చేసుకొని బంతిని విసరడం క్రీడా స్ఫూర్తి అవుతుందా? అని లిటన్ దాస్ ను పంత్ ప్రశ్నించాడు. నా కాళ్ళను టార్గెట్ ఎందుకు చేస్తున్నారంటూ నిలదీశాడు.
కాగా, ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. 10 ఓవర్ల లోపే భారత్ కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ ఆరు పరుగులకే అవుట్ అయ్యాడు. విరాట్ కూడా ఆరు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. గిల్ 0 పరుగులకు నిష్క్రమించాడు. వీరి ముగ్గురిని హసన్ మహమ్మద్ అవుట్ చేశాడు. ఫలితంగా భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో రిషబ్ పంత్ (39), యశస్వి జైస్వాల్ (56) భారత జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
usse feko mujhe kyu maar rhe ho?#RishabhPant being his true self #ViratKohli #RohitSharma #INDvBAN #IndVsBan #INDvsBANTEST
— (@Chirag2410_) September 19, 2024