https://oktelugu.com/

Sunita Williams: నేడే నింగిలోకి సునీతా విలియమ్స్‌.. రాత్రి రోదసీ యాత్ర

అంతరిక్షంలో లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లో ఉన్న ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌(ఐఎస్‌ఎస్‌)కి వ్యోమగాములను చేవవేసే ప్రాజెక్టుపై బోయింగ్‌ స్టార్‌ లైనర్‌ పనిచేస్తుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 1, 2024 / 04:27 PM IST

    Sunita Williams

    Follow us on

    Sunita Williams: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి అంతరిక్ష యాత్రకు ముహూర్తం ఫిక్స్‌ అయింది. భారత కాలమానం ప్రకారం.. శనివారం(జూన్‌ 1న)భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఆమె అంతరిక్షంలోకి బయల్దేరనున్నారు. అంతరిక్షంలో లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లో ఉన్న ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌(ఐఎస్‌ఎస్‌)కి వ్యోమగాములను చేవవేసే ప్రాజెక్టుపై బోయింగ్‌ స్టార్‌ లైనర్‌ పనిచేస్తుంది. ఇందులోనే ఆమెతోపాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ ఐఎస్‌ఎస్‌కు చెందిన హార్మోనీ మాడ్యూల్‌ సబ్‌ సిస్టమ్స్‌ పనితీరుపై వారం పాటు పనిచేయనున్నారు.

    విజయవంతమైతే..
    ఈ పర్యటన విజయవంతమైతే అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్‌ లైనర్‌ను నాసా సర్టిఫై చేసే ప్రక్రియ ప్రారంభిస్తుంది. ఇప్పటి వరకు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్సేస్‌ వాక్‌ నానా సర్టిఫై అయింది. స్టార్‌ లైనర్‌ వ్యోమనౌక అంతరిక్ష యాత్ర కూడా విజయవంతమైతే స్సేస్‌ ఎక్స్‌ జాబితాలో చేరుతుంది.

    బోయింగ్‌ సంస్థ తయారీ..
    ఈ స్టార్‌ లైనర్‌ వ్యోమ నౌకను బోయింగ్‌ సంస్థ తయారు చేసింది. గత నెల 7న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రాకెట్‌ నింగిలోకి పంపే రెండు గంటల ముందు వాల్వ్‌లో సమస్య తలెత్తడంతో కౌంట్‌డౌన్‌ నిలిపవేశారు. దీంతో భారత సంతతికి చెంఇన అమెరికన్‌ వ్యోమగామి సునీత, బుచ్‌ విల్‌మోర్‌ అంతరిక్షఞ యానం వాయిదా పడింది. తాజాగా శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభం కానుంది.

    ఇప్పటికే రెండు సార్లు..
    ఇదిలా ఉంటే సునీతా విలియమ్స్‌ ఇప్పటికే రెండు పర్యాయాలు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. మొదటిసారి 2006లో తొలి రోదసీ యాత్ర చేపట్టారు. తర్వాత 2012లో మరోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. ఇప్పుడు మరోమారు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇది కూడా సునీత సృష్టించిన రికార్డు.