Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మొదటి సినిమాతోనే తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి వరుసగా ఏడు సినిమాలతో సక్సెస్ అందుకొని తనను మించిన స్టార్ హీరో మరొకరు లేరు అనేంతలా ఇండస్ట్రీలో మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు. ఇక ఖుషి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి అన్న చిరంజీవిని మించిన తమ్ముడిగా పేరు సంపాదించుకున్నాడు.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఆయన తనదైన మేనరిజమ్స్ తో ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు సినిమాలని సెట్స్ మీద ఉంచి చాలా బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ ఇప్పుడు మరొక కొత్త సినిమాని కూడా అనౌన్స్ చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి తో సినిమా చేయాలని ఎప్పటినుంచో ప్లానింగ్ లో ఉన్నాడు. కానీ ఆ సినిమా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇక రీసెంట్ గా సురేందర్ రెడ్డి చేసిన ఏజెంట్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సురేందర్ రెడ్డి కి ఛాన్స్ ఇస్తాడా ఇవ్వడా అని అందరూ అనుకున్నారు.
కానీ మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఇప్పుడు సురేందర్ రెడ్డి తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆయనతో ఎలాంటి సినిమా చేస్తాడు అనే విషయం పక్కన పెడితే సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గ కథను రాసుకున్నారట.
మరి అతను పవన్ కళ్యాణ్ తో స్ట్రెయిట్ సినిమా చేస్తాడా లేదంటే ఇంకా ఏదైనా రీమేక్ ను చేయమని పవన్ కళ్యాణ్ చెబుతాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశం మారింది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ వరుసగా మూడు సినిమాలతో సక్సెస్ కొడితే ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొండుతాడు.. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చే సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుంది అనేది…