https://oktelugu.com/

Sunita Williams: ఐఎస్‌ఎస్‌ను వీడిన సునీత.. భూమ్మీదికి ప్రయాణం మొదలు..

Sunita Williams దాదాపు తొమ్మిది నెలల క్రితం అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunitha Williams బుచ్‌ విల్మోర్‌ ఎట్టకేలకు భూమికి తిరిగి వస్తున్నారు. వీరి తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ వ్యోమనౌకలో వీరు ఐఎస్‌ఎస్‌ నుంచి బయల్దేరింది.

Written By: , Updated On : March 18, 2025 / 01:15 PM IST
Sunita Williams (1)

Sunita Williams (1)

Follow us on

Sunita Williams: గతేడాది జూలైలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచర వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌(Buch willmore).. వారం రోజులే అక్కడ ఉండాలి. కానీ అనివార్య కారణాలతో అక్కడే చిక్కుకుపోయారు. 9 నెలలపాటు ఐఎస్‌ఎస్‌లోనే ఉన్న ఇద్దరూ ఎట్టకేలకు భూమికి తిరుగు పయనమయ్యారు. స్పేస్‌ ఎక్స్‌ క్రూ(Space X Cru) వ్యోమనౌక మంగళవారం (మార్చి 18, 2025) ఉదయం 10:15 గంటలకు ఐఎస్‌ఎస్‌ నుంచి విడిపోయి, భూమి వైపు పయనం మొదలుపెట్టింది. నాసా(NASA) ఈ అన్లాకింగ్‌ ప్రక్రియను ప్రత్యక్షంగా ప్రసారం చేసింది. శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను సునిశితంగా పరిశీలించారు. సునీతా విలియమ్స్, విల్మోర్‌తో పాటు నిక్‌ హేగ్, అలెక్సాండర్‌ గోర్బునోవ్‌ కూడా ఈ వ్యోమనౌకలో ఉన్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం(TuesdaY) ఉదయం 8:15 గంటలకు హ్యాచ్‌ మూసివేత జరిగింది. అనంతరం వ్యోమగాములు తమ వస్తువులను ప్యాక్‌ చేసి, క్రూ డ్రాగన్‌లోకి చేరారు. ఐఎస్‌ఎస్‌లో చివరి క్షణాల్లో వారు ఫొటోలు తీసుకున్నారు. ఈ వ్యోమనౌక భూవాతావరణంలోకి పునఃప్రవేశానికి బుధవారం తెల్లవారుజామున 2:41 గంటలకు ఇంజిన్‌ ప్రజ్వలన జరుగుతుంది. ఆ తర్వాత 3:27 గంటలకు ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో దిగనుంది. సహాయ బృందాలు వ్యోమనౌకను వెలికితీస్తాయి.

Also Read: మైక్రో రిటైర్మెంట్‌.. ఉద్యోగ విరమణలో కొత్త ఒరవడి..!

జూలై 5న ఐఎస్‌ఎస్‌కు ప్రయాణం..
2024 జూన్‌ 5న బోయింగ్‌ స్టార్‌లైనర్‌లో సునీతా, విల్మోర్‌ ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. వారం రోజుల్లో తిరిగి రావాల్సిన ఈ మిషన్, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. ఆ వ్యోమనౌక ఆగస్టులో వ్యోమగాములు లేకుండా భూమికి తిరిగొచ్చింది. అప్పటి నుంచి వీరు ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోయారు. నాసా స్పేస్‌ఎక్స్‌ సహాయంతో వీరిని తిరిగి తీసుకొస్తోంది. ఈ 9 నెలల్లో వీరు ఐఎస్‌ఎస్‌లో శాస్త్రీయ పరిశోధనలు, నిర్వహణ పనులు చేశారు. సునీతా రెండోసారి ఐఎస్‌ఎస్‌ కమాండర్‌గా పనిచేశారు. ఈ తిరుగు ప్రయాణం 17 గంటలు పడుతుంది. భూమిపై దిగిన తర్వాత వైద్య పరీక్షలు, రిహాబిలిటేషన్‌ జరుగుతాయి. ఈ సంఘటన వారి ధైర్యానికి, నాసా–స్పేస్‌ఎక్స్‌ సాంకేతికతకు నిదర్శనం.