Prabhas : ప్రస్తుతం స్టార్ హీరోలందరి కంటే టాప్ పొజిషన్ లో ఉన్న హీరో ప్రభాస్…ఆయన వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నాడు. ఏది పడితే అది కాకుండా మంచి సినిమాలు చేయడానికి ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన ‘హను రాఘవపూడి’ (Hanu Raghavapudi) దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరి ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్ స్పిరిట్(Spirit) సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ ఎలాంటి పెను ప్రభంజనాలను సృష్టిస్తాడు. తద్వారా ఆయన కెరియర్ ఏ రేంజ్ లో ఉండబోతుంది ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి తను ఎదుగుతాడా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ ఇకమీదట సైతం నెంబర్ వన్ హీరోగా తన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి భారీ కసరత్తులను చేస్తాడా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.
Also Read : మీరు వర్జినా?.. ఐ యామ్ నాట్.. ప్రభాస్ హీరోయిన్ దిమ్మ తిరిగే ఆన్సర్! ఏమైంది అంటే?
మరి మొత్తానికైతే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ ను మించిన నటుడు మరొకరు లేరనేది వాస్తవం… ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే మాత్రం భారీ విజయాలను సాధించాల్సిన అవసరమైతే ఉంది. తను ఇకమీదట చేయబోయే సినిమాలతో ఇండస్ట్రీ షేక్ అయ్యే విజయాలను సాధిస్తానని దృఢ సంకల్పంతో ఉన్నాడు.
అయితే కెరియర్ మొదటి నుంచి కూడా ఒక దర్శకుడు తో సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టమని చెబుతూ వచ్చాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన రాజకుమార్ హిరానీ…అదే వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందు ఒక సినిమా వస్తుందంటూ చాలా వరకు ప్రచారాలు అయితే జరిగాయి. కానీ రాజ్ కుమార్ హీరాని చేసిన డంకీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పుడప్పుడే సినిమా వచ్చే అవకాశాలైతే లేనట్టుగా తెలుస్తున్నాయి.
ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతంఈ సినిమా తో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక రాజ్ కుమార్ హిరానీ మాత్రం ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి ప్రభాస్ మార్కెట్ కి ఆయన మార్కెట్ కి పొంతన కుదరదనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టు అయితే పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. మరి ఫ్యూచర్ లో అయిన వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : ‘రాజా సాబ్’ ఔట్పుట్ పై ప్రభాస్ తీవ్ర అసంతృప్తి..? 80 శాతం సన్నివేశాలను మళ్ళీ రీ షూట్ చేయబోతున్నారా!