Sora AI app shutdown reason: Artificial Intelligence (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా రంగాలు దీనిని ఉపయోగించుకుంటున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ లో ఏఐని ఎక్కువగా ఉపయోగించి తమ కార్యకలాపాలను నిర్వహించుకుంటున్నారు. అయితే ఏఐ యాప్స్ లో భాగంగా ఒకటైన Sora అనే యాప్ ను ఇటీవల మూసివేశారు. వీడియోలను సృష్టించడంలో ఎంతో ప్రఖ్యాతి చెందిన ఈ యాప్ ఒక్కసారిగా క్లోజ్ చేయడం పై ఆసక్తిగా చర్చ సాగుతోంది. యూజర్స్ కు కావలసిన వీడియోలను అందించిన ఈ యాప్ ఐ ఫోన్ యాప్ స్టోర్ లో అగ్రస్థానంలో నిలిచింది. అయినా కూడా ఈ యాప్ మూసివేతకు కారణం ఏంటని కొందరు టెకీలు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఈ సోరా యాప్ మూసివేతకు కారణం ఏంటి? భవిష్యత్తులో దీనిని ఏ విధంగా మార్చనున్నారు?
Chart Gpt మార్త సంస్థ అయినా open AI అందుబాటులోకి తెచ్చిన Sora యాప్ మూసివేయడంపై ఆసక్తిగా చర్చ సాగుతుంది. అయితే ఈ యాప్ మూసి వేయడానికి కారణాలను ఓపెన్ ఏఐ వివరించింది. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని పనులు సులభంగా చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. దీంతో ఏఐ యాప్స్ కు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. అయితే ఇలాంటి సమయంలో ఆన్లైన్ యాప్స్ పై కాకుండా భౌతికంగా ఉండే రోబోటిక్స్ ను అభివృద్ధి చేయాలని ఓపెన్ ఏఐ తెలుపుతోంది. భవిష్యత్తులో రోబోటిక్స్ ను అందుబాటులోకి తెచ్చి మరిన్ని సేవలు అందిస్తామని ఈ సంస్థ పేర్కొంటుంది. ఇప్పటివరకు సోరా యాప్ కోసం పని చేసిన వారు ఈ రోబోటిక్స్ కోసం తమ సమయాన్ని కేటాయిస్తారని ఓపెన్ ఏఐ ప్రతినిధులు పేర్కొన్నారు.
అయితే ఇప్పటివరకు సోరా యాప్ తో ఒప్పందం చేసుకున్న వాల్ట్ డిస్నీ వంటి సంస్థలు దీని మూసివేతపై సపోర్టుగానే నిలుస్తున్నారు. ఓపెన్ ఏఐ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో తమ అభిమానులను మరింతగా ఆకట్టుకునేందుకు ఏఐతో కలిసి పనిచేస్తామని అన్నారు. సోరా యాప్ ద్వారా ఎంతో మంది ఎన్నో రకాల ప్రయోజనాలు పొందారు. ఇందులో కచ్చితంగా ప్రాంప్ట్ అందిస్తే కావలసిన వీడియో జనరేట్ చేసి ఇస్తుంది. ఒక నిమిషం గల ఈ వీడియో లో ఎలాంటి సోషల్ మీడియాలోనైనా వాడుకునే అవకాశం ఉండేది. అయితే దీని మూసివేత పై కొందరు సోషల్ మీడియాను ఉపయోగించేవారు నిరాశ చెందుతున్నారు. కానీ ఓపెన్ ఏఐ యూజర్స్ ను ఆకట్టుకునే విధంగా మరికొన్ని యాప్స్ ను అందుబాటులోకి తెస్తుందని ఇంకొందరు సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రముఖ యాప్ మూసివేతపై ప్రత్యేకంగా చర్చ సాగుతోంది.
