New Phone Purchase: నేటి కాలంలో మొబైల్ లేని చేతులు కనిపించవు. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఫోన్ ను వాడుతున్నారు. మొబైల్ విప్లవం ఎన్నోరకాలుగా ఉపయోగపడుతున్నా.. అంతే అనర్థాలకు దారి తీస్తోంది. అయితే మొబైల్ ను ఉపయోగకరంగా వాడితే మంచి ప్రయోజనాలు ఇస్తుందని అంటుంటారు. 4జీ నుంచి 5జీకి మారిన తరుణంలో చాలా మంది 5జీ మొబైల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కంపెనీలు సైతం కొత్త కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ తరుణంలో అసలు కొత్త ఫోన్ ఎప్పుడు కొంటే మంచిది? ఏ సమయంలో తక్కువ ధరకు వస్తాయి? అనే సందేహం చాలా మందికి ఉంది. కొందరు నిపుణులు చెబుతున్న ప్రకారం.. ఈ సమయాల్లో మొబైల్ కొనడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.
ఫోన్ కొనే ముందు మనకు ఎంత అవసరమో గుర్తుంచుకోవాలి. సరదా కోసం కొనేవాళ్లు కొంత మంది ఉంటే.. బిజినెస్ కోసం కొనుగోలు చేసేవారు మరికొందరు ఉంటారు. అయితే సరదా కోసం కొనేవాళ్లు తమ బడ్జెట్ కు అనుగుణంగా కొనుగోలు చేయడం మంచిది. ఇక ఇతర వ్యాపారం కోసం తీసుకోవాలనుకునేవారు కాస్త కాస్ట్లీ అయినా మంచి మొబైల్ ను తీసుకోవచ్చు. ఈరోజుల్లో ఏ మొబైల్ అయినా రూ.20 వేల కంటే ఎక్కువ ధరకు రావడం లేదు. అయినా అన్నీ అధునాతన ఫీచర్లు కలిగి తక్కువ ధరకు మొబైల్ రావాలంటే ఈ సమయంలో మాత్రమే కొనుగోలు చేయాలని తెలుపుతున్నారు.
దసరా, దీపావళి ఆఫర్లు:
పండుగ సీజన్ ప్రారంభమైన తరువాత వచ్చే పెద్ద ఫెస్టివల్స్ దసరా, దీపావళి. ఈ పండుగల సందర్భంగా చాలా కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తాయి. ముఖ్యంగా మొబైల్స్ పై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. ఈ సమయంలో ఫోన్ కొనడం వల్ల మీరు ఎంత కాస్ల్టీ ఫోన్ అయినా తగ్గింపు ధరతో దక్కించుకోవచ్చు.
కార్డుపై డిస్కౌంట్ ప్రకటించినప్పుడు:
కొన్ని కంపెనీలు బ్యాంకులతో టైయ్యప్ అయి డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. 5 శాతం, 10 శాతం లాంటివి ఆఫర్ చేస్తాయి. అయితే సంబంధిత బ్యాంకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉంటేనే ఆ ఫోన్ కొనుగోలు చేయడానికి అర్హులవుతారు.
క్లియరెన్స్ సేల్ సమయంలో..:
చాలా కంపెనీలు, షోరూంలో క్లియరెన్స్ సేల్స్ ను ప్రకటిస్తాయి. పాత స్టాక్ తీసేసి కొత్త స్టాక్ తెచ్చుకోవడానికి క్లియరెన్స్ సేల్ చేస్తారు. ఈ సమయంలో ధరలు తగ్గించి అమ్ముతారు. ఈ సమయంలో మొబైల్ ను కొనుక్కోవచ్చు.
కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు:
ఏ కంపెనీ అయిన కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు కాస్త హడావుడి చేస్తుంది. దీంతో తమ కంపెనిక చెందిన ఫోన్ల ధరలను తగ్గించి అమ్ముతుంది. ఈ సమయంలో కొనుగోలు చేయడం వల్ల కాస్తా ఆదా చేసుకోగలుగుతారు.