https://oktelugu.com/

Gmail: డిసెంబర్ 1 నుంచి వాడకుంటే Gmail Accounts Delete అవుతాయా? సేఫ్ గా ఉండాలంటే ఇలా చేయండి

ప్రపంచంలో ఎక్కడున్నా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి మెసేజ్ లేదా ఫైల్స్ పంపించాలనుకుంటే జీమెయిల్ ద్వారానే సాధ్యమవుతుంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చాలా యాప్స్ అందుబాటులోకి వచ్చినా.. జీమెయిల్ ప్రాధాన్యత తగ్గలేదు.

Written By:
  • Srinivas
  • , Updated On : December 1, 2023 / 01:07 PM IST

    Gmail

    Follow us on

    Gmail: Gmail Accounts వినియోగదారులకు షాకింగ్ న్యూస్. డిసెంబర్ 1 నుంచి గూగుల్ సంస్త కొత్త రూల్స్ తీసుకొస్తుంది. జీమెయిల్ ద్వారా కొన్ని కోట్ల మంది మెసేజ్లు, ఫైల్స్ పంపించుకుంటున్నారు. అలాగే కొన్ని సంస్థలు ప్రత్యేకంగా మెయిల్స్ ను జీమెయిల్ ద్వారానే పంపుతున్నాయి. చదువుకున్న ప్రతీ వ్యక్తి ఈరోజుల్లో జీమెయిల్ అకౌంట్ తప్పనిసరిగా ఉంది. మరి ఒక్కసారి గూగుల్ ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి? అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గూగుల్ సంస్థ జీమెయిల్ అకౌంట్స్ డెలీట్ చేయడానికి కారణం ఉంది. అంతేకాకుండా మన జీమెయిల్ అకౌంట్ లాస్ కాకుండా ఒక చిన్న పనిచేయాలి. అదేంటంటే?

    ప్రపంచంలో ఎక్కడున్నా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి మెసేజ్ లేదా ఫైల్స్ పంపించాలనుకుంటే జీమెయిల్ ద్వారానే సాధ్యమవుతుంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చాలా యాప్స్ అందుబాటులోకి వచ్చినా.. జీమెయిల్ ప్రాధాన్యత తగ్గలేదు. కొన్ని ప్రముఖ సంస్థలు, వ్యక్తులు సైతం జీమెయిల్ ను రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. ఎందుకంటే భద్రతతో పాటు ఎలాంటి మెసేజ్ అయినా దీని ద్వారా పంపించుకునే వీలు ఉంటుంది. అయితే గూగుల్ సంస్థ డిసెంబర్ 1 నుంచి విడతల వారీగా జీమెయిల్ అకౌంట్లను డెలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. అందుకు కారణం ఏంటంటే?

    ఈమధ్య సైబర్ నేరగాళ్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. ప్రతీ వ్యక్తి తన పర్సనల్ తో పాటు కంపెనీ, సంస్థ వ్యవహారాలు జీమెయిల్ తోనే నడుపుతూ ఉంటారు. జీమెయిల్ ను హ్యాక్ చేయడం వల్ల వ్యక్తికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలిసిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇలా జీమెయిల్ అకౌంట్ సైబర్ మోసగాళ్ల వలలో పడకుండా 2 స్టెప్ వెరిఫీకేషన్ ను ప్రవేశపెట్టింది. అంటే జీమెయిల్ అకౌంట్ ఓపెన్ కావాలంటే ఒకటి ఫోన్ మెసేజ్.. మరొకటి మరో మెయిల్ కు కోడ్ పంపుతుంది. ఈ కోడ్ ఎంట్రీ చేస్తేనే జీమెయిల్ ఓపెన్ అవుతుంది.

    చాలా మంది వివిధ పేర్లతో జీమెయిల్ అకౌంట్లను క్రియేట్ చేసి వదిలేశారు. వాటిని వాడడం లేదు. అయితే వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు వ్యక్తి రహస్యాలు తెలుసుకుంటున్నారు. అందువల్ల ఇలా యూజ్ చేయని అకౌంట్లను డెలీట్ చేయాలని నిర్ణయించింది. అయితే తప్పనిసరి జీమెయిల్ అకౌంట్ ఉండాలనుకునేవారు ముందుగా ఆ ఐడీకి కొత్త పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఆ జీమెయిల్ ఓపెన్ అయిన తరువాత దాని నుంచి ఇతరులకు మెసేజ్ పంపిచాల్సి ఉంటుంది. అలా చేయడం ద్వారా మీ జీమెయిల్ అకౌంట్ డెలీట్ కాకుండా ఉంటుంది.