Homeజాతీయ వార్తలుTelangana Elections 2023: హంగ్‌ వస్తే ఆ పార్టీలు కలుస్తాయా.. బీర్‌ఎస్‌తో బీజేపీ దోస్తీ సాధ్యమేనా?

Telangana Elections 2023: హంగ్‌ వస్తే ఆ పార్టీలు కలుస్తాయా.. బీర్‌ఎస్‌తో బీజేపీ దోస్తీ సాధ్యమేనా?

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమయింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఎగ్జిట్‌ ఫోల్స్‌ వెల్లడయ్యాయి. ఫలితాల్లో హంగ్‌ వచ్చే అవకాశాలను కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చాయి. చాలా వరకు కాంగ్రెస్‌కు మెజారిటీ ఇచ్చాయి. ఇదిలా ఉంటే.. ఒకవేళ హంగ్‌ వస్తే.. ఏ పార్టీ ఎవరితో కలుస్తుంది. ఎవరెవరు సంకీర్ణ సర్కార్‌ ఏర్పాటు చేస్తారు అన్న చర్చ జరుగుతోంది.

మేజిక్‌ ఫిగర్‌ 60..
తెలంగాణ అసెంబ్లీలో మేజిక్‌ మార్క్‌ 60. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అరవై అక్కర్లేదు. 53 సీట్లు సాధిస్తే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. మజ్లిస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా మద్దతు పలుకుతుంది. కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేద్దామని ఓవైసీ బీఆర్‌ఎస్‌ నేతల కంటే ఎక్కువగా పిలుపునిస్తున్నారు. మజ్లిస్‌కు ఆరు నుంచి ఏడు స్థానాలు ఖాయం. నాంపల్లి సిట్టింగ్‌ స్థానంలో కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇస్తోంది. అక్కడ ఫలితం తారుమారైతే ఆరు స్థానాలు ఖాయం. బీఆర్‌ఎస్‌కు తగ్గే సీట్లు ఈ వీటితో సరిపోతే పంచాయతీనే ఉండదు. మజ్లిస్‌ సీట్లు కూడా కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే బీజేపీ వైపు చూడాలి.

బీజేపీకి పెరగనున్న ఓట్లు సీట్లు..
ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ మంచి ప్రభావం చూపుతుందని చాలావరకు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. బీజేపీ 12 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ఎంఐఎం కలిసినా సర్కార్‌ ఏర్పాటు చేయలేకపోతే అప్పుడు బీజేపీవైపు చూడాలి. ఈ రెండూ కలిస్తే ఈజీగా సర్కార్‌ ఏర్పడుతుంది.

హంగ్‌ వస్తే కాంగ్రెస్‌క అన్ని పరీక్షే..
తెలంగాణ ఫలితాల్లో హంగ్‌ అంటూ వస్తే అసలు పరీక్ష కాంగ్రెస్‌ పార్టీకే ఎదురవుతుంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నపార్టీకి ఎమ్మెల్యేల్ని కాపాడుకోవడం పెద్ద సమస్య అవుతుంది. మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో పోరాడటం సమస్యగా మారుతుంది. అలాగని బీఆర్‌ఎస్‌ పార్టీతో కలవలేరు. ఖచ్చితంగా కంఫర్టబుల్‌ మెజార్టీని కాంగ్రెస్‌ సాధించాల్సి ఉంటుంది.

కాంగ్రెస్‌తో ఎంఐఎం దోస్తీ..
ఇదిలా ఉండగా, ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల తర్వాత ఎంఐఎం బీఆర్‌ఎస్‌కు కటీఫ్‌ చెప్పాలని నిర్ణయించుకుందని సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు స్నేహహస్తం అందించేందుకు సిద్దమైందని తెలుస్తోంది. ఈమేరకు ఇప్పటికే ఎంఐఎం చీఫ్‌ అసద్‌.. కాంగ్రెస్‌ అధిష్టానంతో టచ్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ తమ ఎమ్మెల్యేలు అమ్ముడు పోకుండా.. కాం్యపుకు తరలిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా తెలంగాణలో హంగ్‌ వస్తే కీలక పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయం. అయితే బీఆర్‌ఎస్, బీజేపీ కలుస్తాయా, కాంగ్రెస్, ఎంఐఎం కలుస్తాయా అన్నది ఆసక్తిగా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version