Homeఅంతర్జాతీయంIran Israel USA War: దేశద్రోహిని మట్టుబెట్టిన ఇరాన్‌.. ఎవరో తెలుసా?

Iran Israel USA War: దేశద్రోహిని మట్టుబెట్టిన ఇరాన్‌.. ఎవరో తెలుసా?

Iran Israel USA War: ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం తారాస్థాయికి చేరింది. యుద్ధం మొదలైన మొదటి రోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా చంపేసింది. దీంతో ఇరాన్‌ సైలెంట్‌ అవుతుందని అంతా భావించారు. కానీ ఇరాన్‌ ఎర్రజెండా ఎగరేసింది. ఇజ్రాయెల్, అమెరికా అనుకూల గల్ఫ్‌ దేశాలపై ప్రతీకార దాడి చేస్తోంది. ఇక మొదటిరోజే ఖమేనీ మరణానికి అంతర్గతంగా అందించిన సమాచారమే కారణమని ఇరాన్‌ గుర్తించింది. దేశద్రోహి ఇచ్చిన సమాచారంతోనే అమెరికా దాడి చేసిందని విచారణలో తేలింది.

Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే

దేశద్రోహి గుర్తింపు..
ఇరాన్‌ అధికారులు ఇస్మాయిల్‌ ఖానీని (క్వడ్స్‌ ఫోర్స్‌ హెడ్‌) మోసాద్‌ ఏజెంట్‌గా గుర్తించారు. ఖమేనీ కదలికలు, సమావేశాల సమాచారాన్ని అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇచ్చినట్టు విచారణలో తేలింది. దాడి ముందు సమావేశం నుంచి మొదట బయటకు వెళ్లి సమాచారం లీక్‌ చేశారని, హమాస్‌ చీఫ్, ప్రెసిడెంట్‌ దాడులకు కూడా మద్దతు ఇచ్చారని చెబుతున్నారు.

హతమార్చిన ఐఆర్‌జీసీ..
ఐఆర్‌జీసీ ఇస్మాయిల్‌ను ఉరితీసిందని రెడ్డిట్, ఫేస్‌బుక్‌ పోస్టులు ప్రచారం చేస్తున్నాయి, కానీ అధికారిక మీడియా ధ్రువీకరణ చేయలేదు. గతంలో ఇలాంటి ఆరోపణలు (2024 అక్టోబర్‌లో ప్రాంతీయ దాడుల్లో బయటపడ్డారు) తప్పుగా ఉన్నాయి. మోసాద్‌ ఇన్‌ఫిల్ట్రేషన్‌ అనుమానంతో పరిశోధన జరుగుతోందని తెలుస్తోంది.

మోసాద్‌ స్పైలుగా..
ఇరాన్‌ గతంలో మోసాద్‌ స్పైలను ఎంతో మందిని చంపేసింది. 2025 ఏప్రిల్‌లో మోహ్సెన్‌ లంగర్నేషిన్‌ (ఐఆర్‌జీసీ కల్నల్‌ హసన్‌ సయ్యద్‌ ఖోదాయి హత్యకు సహకారం), 2022 ఇస్ఫహాన్‌ దాడి సంబంధితులు. 2025లో 1500 మంది ఉరి తీసింది. మోసాద్‌కు సీఐఏకు లీకులు ఇస్తున్నారని ఇరాన్‌ ఈ పని చేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version