https://oktelugu.com/

RO, UV, UF Purified Watter : RO, UV, UF ఫ్యూరిఫైడ్ లల్లో ఏది బెటర్? అవి ఎలా పనిచేస్తాయి?

100 శాతం స్వచ్ఛమైన ఎక్కడా దొరకదు. కానీ కనీసం 90 శాతానికి పైగా నాణ్యమైన నీటిని ఫ్యూరిఫైడ్ ద్వారా పొందవచ్చు.  అయితే ప్యూరిఫై డ్ వాటర్ ఫిల్టర్ లో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా RO, UV, UFలు

Written By:
  • Srinivas
  • , Updated On : July 21, 2023 1:45 pm
    Follow us on

    RO, UV, UF Purified Water : ఎండలు దంచికొట్టిన తరువాత వర్షాలు వరుసగా కురుస్తున్నాయి. దీంతో చాలా మంది కూల్ అయ్యారు. అయితే వర్షాకాలం హాయిగా అనిపించినా వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా నీరు కలుషితం అవతుంది.  దీంతో నీరు టీసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి చేసిన నీటిని తీసుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ ప్రతీసారి వేడి చేసిన నీరు దొరకాలంటే సాధ్యం కాదు.
    ఈ తరుణంలో ప్యూరిఫైడ్ వాటర్ ను తాగడం అలవాటు చేసుకోవాలని అంటున్నారు. 100 శాతం స్వచ్ఛమైన ఎక్కడా దొరకదు. కానీ కనీసం 90 శాతానికి పైగా నాణ్యమైన నీటిని ఫ్యూరిఫైడ్ ద్వారా పొందవచ్చు.  అయితే ప్యూరిఫై డ్ వాటర్ ఫిల్టర్ లో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా RO, UV, UFలు గురించి చాలా మందికి తెలుసు.  ఇవి మూడు వాటర్ ను ఫ్యూరిఫైడ్ చేస్తాయి. కానీ ఇందులో తేడాలున్నాయి. అవేంటంటే?
    ఆర్వో అనేది పూర్తిగా ఫిక్స్ డ్ పార్ట్. దీనిని వాటర్ ఫిల్టర్ లాగా కాకుండా ఒక ప్రత్యేక ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ఆర్వో చాంబర్ లోకి నీళ్లు వెళ్తాయి. ఇందులో ఉండే మెంబ్రేన్ ఫిల్టర్స్ లోకి  హై ప్రెజర్ తో నీటిని పంపిస్తారు. మెంబ్రైన్ ఫిల్టర్ ద్వారా నీటిలో ఉండే బ్యాక్టిరియా, వైరస్ లు, క్లోరిన్, కెమెకల్స్ లాంటివి బయటకు రావు. అక్కడే ఆగిపోతాయి. దీంతో 99 శాతం నీటిని తాగవచ్చు. నేటి కాలంలో ఎక్కువగా ఆర్వోకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.
    ఇందులో రెండో యూవీ. ఇది ఆర్వో మాదిరిగానే పనిచేస్తుంది. అయితే ఇందులో నీటిలో ఉండే మలినాలను బయటకు రిలీజ్ చేయకుండా యూవీ కిరణాలు ఆపుతాయి. రేడియేషన్ ద్వారా ఆటోమెటిక్ గా యువీ కిరణాలు నీటిపై పడడంతో అందులో ఉండే బ్యాక్టీరియా చచ్చిపోతుంది. అయితే యూవీ ద్వారా కెమెకల్స్, స్టాల్స్ అలాగే బయటకు వస్తాయి.
    యుఎఫ్ వాటర్ ఫిల్టర్ అచ్చం సాధారణ వాటర్ ఫిల్టర్ లాగే ఉంటుంది. దీనికి పవర్ అవసరం లేదు.  అయితే ఇందులో ఉండే చిన్న చిన్న మెంబ్రేన్స్ బ్యాక్టిరి, వైరస్ లు బయటకు వెళ్లలేవు. కానీ బ్యాక్టిరియా, వైరస్ కంటే చిన్నవిగా ఉండే గుడ్లలాంటివి బయటకు వస్తాయి. అలాగే నీటిలో ఉండే కెమికల్స్ అలాగే వస్తాయి.