Homeబిజినెస్Vivo X300 Pro: పెద్దపెద్ద కెమెరాలు అక్కర్లేదు.. ఈ ఫోన్ కొనండి చాలు.. పిచ్చ క్వాలిటీ

Vivo X300 Pro: పెద్దపెద్ద కెమెరాలు అక్కర్లేదు.. ఈ ఫోన్ కొనండి చాలు.. పిచ్చ క్వాలిటీ

Vivo X300 Pro: ప్రస్తుత కాలంలో చాలా పనులు మొబైల్ చేసేస్తుంది. చేతిలో మొబైల్ ఉంటే ప్రపంచం మన దగ్గరే ఉన్నట్లు. ఎందుకంటే ఏ మూలన ఏం జరిగిందో తెలుసుకోవడానికి మొబైల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రకరకాల అవసరాలను మొబైల్ తీరుస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు సైతం మొబైల్ పై ఆధారపడుతున్నారు. ఇలాంటి మొబైల్ నాణ్యమైనదిగా ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. మార్కెట్లోకి ఎన్నో రకాల ఫోన్లు వస్తూ ఉంటాయి. కానీ ఇందులో ఎవరి అవసరాలకు తగిన విధంగా వారు కొనుగోలు చేస్తుంటారు. నేటి కాలంలో ఫోన్లో అత్యధికంగా కోరుకునే ఫీచర్ మంచి క్వాలిటీ తో కూడిన కెమెరా. మొబైల్లో కెమెరా పని తీరు బాగుంటే అనేక రకాల అవసరాలను తీరుస్తుంది. అయితే యూత్ తో పాటు అన్ని వర్గాల వారికి బాగా నచ్చే కెమెరా ఉన్న మొబైల్ ఒకటి ప్రస్తుతం మార్కెట్లో రిలీజ్ అయింది. ఆ ఫోన్ ఏదో ఇప్పుడు చూద్దాం..

యూట్యూబ్ వీడియోలు, కొన్ని సినిమా చిత్రీకరణలు ఒకప్పుడు పెద్దపెద్ద కెమెరాలతో తీసేవారు. అలాగే పెళ్లిళ్లు లేదా ఇతర ఫంక్షన్లకు సంబంధించిన వీడియోలను కూడా వీడియో కెమెరాతో తీసేవారు. కానీ ప్రస్తుతం అంతకుమించినా కెమెరా క్వాలిటీ కలిగిన మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిలో అన్నిటికన్నా హైలెట్గా నిలుస్తోంది Vivo X300 Pro. ఇటీవల ఈ మొబైల్ మార్కెట్లోకి రిలీజ్ అయింది. 9500 SoC, 200 MP కెమెరా కలిగిన ఫోన్ ప్రస్తుతం ఆన్లైన్ లో బుకింగ్ కు రెడీగా ఉంది. మరి దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

చైనాకు చెందిన Vivo కంపెనీ గత నెల కిందట ఈ మొబైల్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది ఇందులో X 300 సిరీస్తోపాటు flag fish లను కూడా పరిచయం చేసింది. ఈ రెండు మొబైల్స్ కెమెరా 9500 చిప్స్ సెట్ తో పనిచేస్తాయి. సెల్ఫీ తీసుకోవాలని అనుకునే వారికి 50 మెగాపిక్సల్ కెమెరాను కలిగి ఉంది. అలాగే ఇందులో 6,510 mAh బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉంది.

మొబైల్ ఫీచర్ విషయానికి వస్తే..1.5 BOE Q10, LTPO OLED డిస్ప్లేను కలిగి ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో పాటు అవుట్ డోర్ విజిబులిటీ ఎక్కువగా ఉంటుంది. ఇందులో అల్ట్రా సోనిక్ ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్పీకర్, యాక్షన్ బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే వైఫై 7, బ్లూటూత్ 5.4 వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం ఇండియాలోని కంపెనీ వెబ్సైట్ ద్వారా దీనిని బుకింగ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 10 నుంచి ఫోన్లో రిలీజ్ అవుతాయి. వీటిలో Vivo X300 (16GB RAM + 512GB Storage) ధర రూ.1,09,999 గా ఉంది. అలాగే 12gb ram+256 స్టోరేజ్ కలిగిన మొబైల్ రూ.75,999 తో విక్రయిస్తున్నారు.12gb ram+512 స్టోరేజ్ కలిగిన మొబైల్ రూ.81,999 ధరతో అందుబాటులో ఉంది. అయితే వీటిని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.4,000, ఎస్బిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకు వినియోగదారులకు 10 శాతం డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version