Budget Mileage CNG Cars : రూ.10 లక్షలలోపు అత్యధిక మైలేజ్ వచ్చే CNG కార్లు ఏవో తెలుసా?

లేటేస్ట్ అప్డేట్ ఫీచర్స్ తో రూ.10 లక్షల లోపు వచ్చే కార్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కిందికి వెళ్లండి..

Written By: Chai Muchhata, Updated On : July 21, 2023 1:33 pm
Follow us on

Budget Mileage CNG Cars :  కారు కొనాలనుకునేవారు  CNGలపై ఆసక్తి చూసుతున్నారు. ఇక్కువ మైలేజ్ సామర్థ్యాన్ని ఇస్తాయి. కంపెనీలు సైతం వినియోగదారులకు అనుగుణంగా ఎక్కువ శాతం  CNG మోడళ్లను మార్కెట్లకి తీసుకొస్తున్నాయి. అయితే మొదట్లో వీటి ధరలు అధికంగానే ఉండేవి. కానీ రాను రాను పోటీ కారణంగా వీటి ప్రైజ్ తగ్గుతూ వస్తున్నాయి. లేటేస్ట్ అప్డేట్ ఫీచర్స్ తో రూ.10 లక్షల లోపు వచ్చే కార్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కిందికి వెళ్లండి..
దేశీయ కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకి అగ్రగామిగా ఉంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన చాలా మోడళ్లు మంచి పేరు తెచ్చుకున్నాయి.  CNG వెర్షన్ లో మారుతి నుంచి ప్లాగ్ షిప్ ను మార్కెట్లోకి తీసుకొచ్చాు. ఇది సిగ్మా, డెల్టా వేరియంట్లలో లభిస్తుంది. 1.2 లీటర్ నాచురల్ అస్పిరేటేడ్ పెట్రోల్ ఇంజిన్ తో  75 బీహెచ్ పీ గరిష్ట శక్తిని అందిస్తూ 98.5 టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.8.42 లక్షల నుంచి రూ.9.28 వరకు షోరూంలల్లో విక్రయిస్తున్నారు.
హ్యుండాయ్ కంపెనీ సైతం  CNG మోడల్ ను రిలీజ్ చేసింది. ఎక్స్ టర్ మైక్రో ఎస్ యూవీని రూ.5.99 లక్షలతో విడుదల  చేయగా S యరియు SX వేరియంట్లు  CNGతో లభిస్తాయి. 1.2 లీటర్ ఇధనం గరిష్టంగా 67హెపీ పవర్ వద్ద 95ఎన్ ఎం ను ఉత్పత్తి చే్తుంది. 5 స్పీడ్ మాన్యువల్  గేర్ బాక్స్ ను కలిగి ఉన్న ఇవి కిలోమీటర్ కు 27.1 మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ.8.24 లక్షల నుంచి 8.97 వరకు షోరూంలల్లో లభిస్తాయి.
మారుతి సుజుకి నుంచి రిలీజ్ బ్రెజ్జా గురించి తెలిసిందే. అయితే దీనిని  CNG వెర్షన్లో రిలీజ్ చేసంది. 1.5 లీటర్ నాచులర్సీ అస్పిరేటేడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 85.8 హెచ్ పీ పవర్ వదద 121 ఎన్ ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్  మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఎంపికతో 25.51 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. దీనిని రూ.9.24 లక్షల నుంచి రూ.12.15 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
 CNG వెర్షన్లలో మిగతా కంపెనీల కంటే మారుతి సుజుకీ, హ్యుండాయ్ లు మాత్రమే విక్రయిస్తున్నారని తెలుస్తోంది.