Producer Suresh Babu: నేడు విడుదల అవ్వాల్సిన నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం వాయిదా పడడం నందమూరి అభిమానులకు మామూలు షాక్ కాదు. థియేటర్స్ వద్ద బ్యానర్స్, కటౌట్స్, డీజే, ఇలా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని, తమ అభిమాన హీరో ని వెండితెర పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ సినిమా వాయిదా పడింది అనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తూ వచ్చాయి. కాబట్టి ఈ సినిమా కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆడియన్స్ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. అన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా జరిగాయి.
కేవలం ఆంధ్ర ప్రదేశ్ నుండి లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. బంపర్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంటుంది అని అనుకుంటున్న సమయం లో ఇలా వాయిదా పడడం దురదృష్టకరం. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా వాయిదా పై ప్రముఖ సీనియర్ నిర్మాత సురేష్ బాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. శ్రీనందు హీరో గా నటిస్తున్న సైక్ సిద్దార్థ్ మొదటి పాట లాంచ్ కార్యక్రమం లో పాల్గొన్న ఆయన ‘అఖండ 2’ వాయిదా గురించి ప్రస్తావించాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను కూడా ఈ సినిమా వాయిదా పడడానికి గల సమస్యలను పరిష్కారించడానికి నేను కూడా నా వంతు ప్రయత్నాలు చేస్తున్నాను. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవన్నీ ఆర్ధిక పరమైన ఇబ్బందులు, బయటకు చెప్పకూడదు. ఈ సినిమా రిలీజ్ కాకపోవడానికి ప్రతీ ఒక్కరు తమకు తోచిన విధంగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. వాటిల్లో ఎలాంటి నిజం లేదు. ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి భారీ సినిమాలకు సమస్యలు రావడం మనమంతా చూసాము, అభిమానులు భయపడాల్సిన అవసరమే లేదు, త్వరలోనే విడుదల తేదీని మేకర్స్ ప్రకటిస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
