Supermoon December 2025: చిన్నప్పుడు అన్నం తినకుంటే అమ్మ మనకు చందమామను చూపించి గోరుముద్దలు తినిపించేది. చందమామను చూస్తూ.. అమ్మ చేతి గోరుముద్దలు తింటూ.. చాలామంది తన్మయత్వానికి గురయ్యారు. చందమామను చూసుకుంటూ ఆనందపడేవారు. అనంతమైన ఆకాశంలో తెల్లటి బంతిలా చందమామ మెరిసిపోయేవాడు. పున్నమి నాడు చందమామ మరింత అందంగా కనిపించేవాడు. గుండ్రంగా.. దీప శిఖలాగా వెలిగిపోయేవాడు. చందమామను చూడాలంటే పున్నమినాడే.. ఎందుకంటే ఆ రోజే చందమామ అసలు రూపం కనిపిస్తుంది. పున్నమి నాడు చందమామ వెలుగుతుంటాడు. చల్లని వెన్నెల ప్రసాదిస్తూ ఉంటాడు.
చీకటిలో.. విశాలమైన ఆకాశంలో తెలుపు రంగు బంతిలాగా వెలిగిపోతుంటాడు. పున్నమినాడు చందమామను చూసి ఎంతోమంది కవులు కావ్యాలు రాశారు. రాస్తూనే ఉన్నారు. భావుకత్వానికి, కవితాత్మక ధోరణికి చందమామ ఒక నిజమైన కథా వస్తువు. చాలామంది కవులు తమ కవితలలో ఎక్కడ ఒక సందర్భంలో చందమామను ప్రస్తావిస్తూనే ఉంటారు. చందమామ గురించి వర్ణిస్తూనే ఉంటారు. చందమామ గురించి ఇలా చెప్పుకుంటూ పోవాలి గాని.. ఎన్నో రాయచ్చు.. ఇంకా ఎన్నో వర్ణించవచ్చు.
చందమామ పౌర్ణమి నాడు అద్భుతంగా కనిపిస్తాడు. పౌర్ణమి నాడు చందమామను చూస్తూ చాలామంది తమ బాల్యాన్ని నెమరు వేసుకుంటారు. చందమామను చూస్తూ అనంతమైన ఆకాశాన్ని ఆసక్తిగా తలకిస్తుంటారు. చందమామ ఆకాశంలో కనిపించే తీరును బట్టి శాస్త్రవేత్తలు రకరకాలుగా వర్గీకరించారు. అందులో ప్రధానమైనది సూపర్ మాన్. సూపర్ మూన్ లో భాగంగా ఈ ఏడాది ఆఖరి “బిగ్గర్ మూన్” గురువారం ఆకాశంలో కనువిందు చేయనున్నాడు. చందమామ భూమికి 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు.
గురువారం రోజు పూర్తిస్థాయిలో పరిమాణం కంటే 10% ఎక్కువ సైజులో, 30% ఎక్కువ వెలుగుతో చందమామ కనిపిస్తాడు. పౌర్ణమి రోజుల్లో చందమామ పెద్ద పరిమాణంలో కనిపిస్తే దానిని సూపర్ మూన్ అంటారు. సూపర్ మూన్ లో చందమామ తెలుపు రంగులో కాకుండా, లేత ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఆరోజు కాంతి కూడా ప్రజ్వలంగా ఉంటుంది. అయితే మామూలుగా కాకుండా, టెలిస్కోప్ తో చూస్తే చందమామ వెలుగు మరింత ఎక్కువగా కనిపిస్తుంది. చందమామ పరిమాణం కూడా అనంతంగా దర్శనమిస్తుంది.
సూపర్ మూన్ ఏర్పడేందుకు అనేక కారణాలు ప్రభావితం చేస్తాయి. సూర్యుడి వెలుగు.. చంద్రుడి భ్రమణం.. అంతరిక్షంలో పరిణామాలు.. సూపర్ మూన్ కు దారి తీస్తాయి. సూపర్ మాన్ ఏర్పాటును మొదట్లో శాస్త్రవేత్తలు ప్రమాదానికి సంకేతంగా భావించేవారు. ఆ తర్వాత అనేక పరిశోధనలు చేయడం ద్వారా సూపర్ మూన్ వల్ల భూమికి ఎటువంటి నష్టం లేదని తేల్చారు.