https://oktelugu.com/

కస్టమర్లకు శుభవార్త.. జియో బడ్జెట్ 4జీ స్మార్ట్ ఫోన్స్ విడుదల ఎప్పుడంటే..?

దేశీయ టెలీకాం రంగంలో జియో రాకతో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్న సంగతి తెలిసిందే. జియో తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలతో టారిఫ్ ప్లాన్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడంతో కాల్స్, డేటా ధరలు భారీగా తగ్గాయి. ఆ తరువాత జియో తక్కువ ధరకే జియో ఫోన్లను అందుబాటులోకి తెచ్చి ఫీచర్ ఫోన్లలో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. త్వరలో జియో స్మార్ట్ ఫోన్లను కూడా అందుబాటులోకి తీసుకురానుందని గతంలో వార్తలు వచ్చాయి. Also Read: జియో కొత్త ప్లాన్.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 3, 2020 1:28 pm
    Follow us on

    Jio
    దేశీయ టెలీకాం రంగంలో జియో రాకతో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్న సంగతి తెలిసిందే. జియో తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలతో టారిఫ్ ప్లాన్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడంతో కాల్స్, డేటా ధరలు భారీగా తగ్గాయి. ఆ తరువాత జియో తక్కువ ధరకే జియో ఫోన్లను అందుబాటులోకి తెచ్చి ఫీచర్ ఫోన్లలో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. త్వరలో జియో స్మార్ట్ ఫోన్లను కూడా అందుబాటులోకి తీసుకురానుందని గతంలో వార్తలు వచ్చాయి.

    Also Read: జియో కొత్త ప్లాన్.. రోజుకి 3జీబీ డేటా!

    జియో 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయల బడ్జెట్ లో ఈ స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే జియో నేరుగా స్మార్ట్ ఫోన్లను విడుదల చేయకుండా పలు కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంటోందని తెలుస్తోంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివోతో భాగస్వామ్యం కుదుర్చుకుని జియో ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్ ఫోన్లను ఈ నెలలొనే విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

    Also Read: వాట్సాప్‌.. నయా ఫీచర్స్‌ అదుర్స్?

    వివో వై సిరీస్ లో ఈ కొత్త ఫోన్ అందుబాటులోకి రానుందని.. జియో ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్ మెంట్, ఓటీటీ సబ్ స్క్రిప్షన్, డిస్కౌంట్లను ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్లలో జియో సిమ్ కార్డ్ మాత్రమే పని చేస్తుందని ఇతర కంపెనీల సిమ్ కార్డులు పని చేయవని సమాచారం. జియో ఇతర కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోందని సమాచారం. గూగుల్ తో ఒప్పందాలు కుదుర్చుకుని జియో తక్కువ ధరకే ఫోన్లను అందుబాటులోకి తెచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    మరోవైపు ఎయిర్ టెల్ కూడా ఇదే విధంగా కస్టమర్లకు స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఎయిర్ టెల్ లావా, కార్బన్‌ తో ఒప్పందాలు కుదుర్చుకుని స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన చేసింది.