https://oktelugu.com/

కవితకు మంత్రి పదవి ఖాయమే.!

తెలంగాణలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండనున్నాయా..? ఇందులో కవితకు మంత్రి పదవి దక్కనుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కవిత ఎమ్మెల్సీ కాకముందే నుంచి ఈ ప్రచారం ఉన్నది. ఎమ్మెల్సీ అయ్యాక అది మరింత ఎక్కువైంది. దీనిపై మీడియాలో ఎన్ని సార్లు క్వశ్చన్‌ చేసినా లైట్‌ తీసున్న కవిత ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Also Read: అతివిశ్వాసమా.. మొండి తనమా..? కీలక వ్యాఖ్యలు ఇటీవల కరీంనగర్‌లో కేబినెట్‌లో ఎప్పుడు చేరుతున్నారంటూ మీడియా ప్రతినిధులు అడగగా.. ఇంగ్లిష్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 3, 2020 11:58 am
    Follow us on

    Kavitha
    తెలంగాణలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండనున్నాయా..? ఇందులో కవితకు మంత్రి పదవి దక్కనుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కవిత ఎమ్మెల్సీ కాకముందే నుంచి ఈ ప్రచారం ఉన్నది. ఎమ్మెల్సీ అయ్యాక అది మరింత ఎక్కువైంది. దీనిపై మీడియాలో ఎన్ని సార్లు క్వశ్చన్‌ చేసినా లైట్‌ తీసున్న కవిత ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    Also Read: అతివిశ్వాసమా.. మొండి తనమా..?

    కీలక వ్యాఖ్యలు

    ఇటీవల కరీంనగర్‌లో కేబినెట్‌లో ఎప్పుడు చేరుతున్నారంటూ మీడియా ప్రతినిధులు అడగగా.. ఇంగ్లిష్ న్యూఇయరా.. ఉగాదా.. అంటూ ఎదురు ప్రశ్నించారు. అయితే సంక్రాంతికి ముందే మంత్రిగా మారతారా అడగగా ఉగాది వరకూ ఆగాలా అని మరో ఎదురు ప్రశ్న వేశారు. మంత్రి పదవి గురించి ప్రస్తావన వస్తే అలాంటిది ఏమీ లేదని చెప్పే కవిత.. ఇప్పుడు ఏకంగా సంకేతాలు ఇవ్వడంపై సొంత క్యాడర్‌‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో టీడీపీ మాజీ మంత్రి బుక్?

    కేసీఆర్‌‌ కూడా ఓకే..

    కేసీఆర్ తన కుమార్తె అయిన కవితను సాధారణ ఎమ్మెల్సీగా ఉంచేందుకు ఇష్టపడరని. ఉన్నతమైన పదవికి అప్పగించేందుకే ఈ అవరాశం ఇచ్చారన్నా చర్చ కొంత కాలంగా ఉంది. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోగానే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరిస్థితుల్ని బట్టి కేటీఆర్‌కు ప్రభుత్వ పగ్గాలిచ్చి జాతీయ రాజకీయాలవైపు వెళ్తారనే చర్చ కూడా ఉంది. గ్రేటర్ ఎన్నికల సమయంలోనూ దేశ రాజకీయాలపై కీల క వ్యాఖ్యలు చేశారు. దేశానికి దిశానిర్దేశం కావాలని.. అది తానే చేయవచ్చని కూడాచెప్పారు. మరో రెండు నెలల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్