https://oktelugu.com/

బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనే?

బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో షో పై ఆసక్తి రోజురోజుకూ రెట్టింపు అవుతుంది. ఇక డిసెంబర్ 20వ తేదీన ఫైనల్స్ ఉంటుందని తెలుస్తోంది. అందుకే ప్రతివారం ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ షో పై ఇంకా ఇంట్రస్ట్ ను పెంచుతున్నారు. తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో ఓట్లను పరిశీలిస్తే దేత్తడి హారికకు అతి తక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కంటెస్టెంట్లకు వచ్చిన ఓట్లను చూస్తే హారిక చివరి స్థానంలో ఉందట. దీంతో […]

Written By:
  • admin
  • , Updated On : December 3, 2020 / 12:15 PM IST
    Follow us on


    బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో షో పై ఆసక్తి రోజురోజుకూ రెట్టింపు అవుతుంది. ఇక డిసెంబర్ 20వ తేదీన ఫైనల్స్ ఉంటుందని తెలుస్తోంది. అందుకే ప్రతివారం ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ షో పై ఇంకా ఇంట్రస్ట్ ను పెంచుతున్నారు. తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో ఓట్లను పరిశీలిస్తే దేత్తడి హారికకు అతి తక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కంటెస్టెంట్లకు వచ్చిన ఓట్లను చూస్తే హారిక చివరి స్థానంలో ఉందట. దీంతో ఆమె ఈ వారం ఇంటిని వీడే అవకాశం ఉంది. కాగా గతవారం ఎలిమినేషన్ నుంచి జబర్దస్త్ అవినాష్ తృటిలో తప్పించుకోవడం కూడా దేత్తడి హారికకు బాగా మైనస్ అయిపోయింది.

    Also Read: బిగ్ బాస్ : అరియానా ఎమోషన్ మాములుగా లేదుగా !

    అయితే ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవుతారని అంతా అనుకుంటున్న సమయంలో.. ఇప్పుడు తాజాగా ఎలిమినేషన్‌కు సంబంధించి దేత్తడి హారికకు అతి తక్కువ ఓట్లు వచ్చాయనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు.. అంటూ ఇటు ప్రేక్షకుల్లో అటు కంటెస్టెంట్లలో చర్చ మొదలైంది. అయితే పాలు పట్టే టాస్క్‌లో అసహనంకు గురైన అవినాష్ తనను ఎలిమినేట్ చేయాల్సిందిగా బాహాటంగానే బిగ్ బాస్ ను డిమాండ్ చేశాడు కాబట్టి, మరి బిగ్ బాస్ అవినాష్ ను ఎలిమినేట్ చేసినా చెయ్యొచ్చు.

    Also Read: ‘వదినమ్మ’ రాక కోసమే బిగ్ బాస్ టైమ్ మారింది !

    కాగా బిగ్ బాస్ మదిలో ఎవరున్నారనేది ఇంకా స్పష్టత రాకపోయినా.. కంటెస్టెంట్లలో ఓట్లను పరిశీలిస్తే దేత్తడి హారిక చివరి స్థానంలో ఉందనేది స్పష్టం అవుతోంది. ఈ లెక్కన ఆమె ఈ వారం ఇంటిని వీడే అవకాశం ఉందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇదే కనుక జరిగితే హారికాకు ఉన్న ఫ్యాన్స్ కచ్చితంగా షాక్‌కు గురవుతారట. మరి ఆమెకు నిజంగానే ఫ్యాన్స్ ఉన్నారా.. ఏమైనా ఉన్నవాళ్లలో హారికా కూడా టైటిల్ పోరులో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్