Realme GT 6T: రాకెట్ వేగంతో చార్జింగ్, అదిరిపోయే డిజైన్..స్మార్ట్ ఫోన్ లల్లో ఇది తోపు

భారత మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ను మే 22న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది.. అమెజాన్ ఈ ఫోన్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది.. అంటే ఈ ఫోన్ ను రియల్ మీ కంపెనీ అమెజాన్ నుంచి విక్రయిస్తుందన్నమాట.

Written By: Anabothula Bhaskar, Updated On : May 15, 2024 1:54 pm

Realme GT 6T

Follow us on

Realme GT 6T: స్మార్ట్ ఫోన్ ల విభాగంలో రియల్ మీ(realme) కంపెనీ మరో కొత్త మోడల్ ను అందుబాటులోకి తెచ్చింది. 5G విభాగంలో ప్రత్యర్థి కంపెనీలకు దీటుగా సరికొత్త నమూనాను ఆవిష్కరించింది. దీనికి GT 6T పేరు పెట్టింది. దీనికి సంబంధించిన ఫీచర్లను కూడా ఒక్కొక్కటిగా ఆవిష్కరిస్తోంది. 120W ఫాస్ట్ చార్జింగ్, అదిరిపోయే డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకత.

భారత మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ను మే 22న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది.. అమెజాన్ ఈ ఫోన్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది.. అంటే ఈ ఫోన్ ను రియల్ మీ కంపెనీ అమెజాన్ నుంచి విక్రయిస్తుందన్నమాట.

ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలను అమెజాన్ ఒక్కొక్క ఫీచర్ ను టీజింగ్ చేయడం మొదలుపెట్టింది. ఈ ఫోన్ ఇమేజ్ ను ముందుగా బయట పెట్టింది. అదిరిపోయే డిజైన్ తో ఈ ఫోన్ ను రూపొందించినట్టు సంకేతాలు ఇచ్చింది. దీంతో ఈ ఫోన్ పై వినియోగదారుల్లో అంచనాలు పెరిగిపోయాయి. సన్నని, షైనీ డిజైన్ తో రూపొందించడంతో ఫోన్ ఊరికనే ఆకట్టుకుంటున్నది. ఫోన్ వెనక డ్యూయల్ కెమెరా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

ఈ ఫోన్ లో Snapdragon 7 + GEN 3 చిప్ సెట్ ను అమర్చారు. ఇలాంటి ఆకృతితో భారత మార్కెట్లో విడుదలవుతున్న తొలి ఫోన్ ఇదే. పైగా ఈ చిప్ సెట్ 1.5 AnTuTu స్కోర్ తో అద్భుతమైన అనుభూతిని వినియోగదారులకు అందిస్తుంది..GT 6T స్మార్ట్ ఫోన్ కు 120W సూపర్ ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ లభిస్తుంది. 5500 mAh బిగ్ బ్యాటరీ ఫోన్ జీవిత కాలాన్ని మరింత మెరుగుపరుస్తుంది.. ఈ ఫోన్లో కర్వ్ డ్ డిస్ ప్లే, టైప్ – సీ చార్జ్ పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ విడుదలయ్యే నాటికి మరిన్ని ఫీచర్స్ రియల్ మీ కంపెనీ బయటపెట్టే అవకాశం ఉంది.

ఈ ఫోన్ ధర 22 నుంచి 25 వేల మధ్యలో ఉండే అవకాశం కనిపిస్తోంది. సూపర్ ఛార్జింగ్, అదిరిపోయే డిజైన్ తో ఈ మోడల్ ను ఆవిష్కరిస్తున్నామని.. ముఖ్యంగా యువత ఈ ఫోన్ ను ఎక్కువగా ఇష్టపడతారని రియల్ మీ కంపెనీ చెబుతోంది. అమెజాన్ ద్వారా మాత్రమే విక్రయాలు జరుపుతామని.. తొలి నెలలో దాదాపు 10 లక్షల వరకు హ్యాండ్ సెట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రియల్ మీ చెబుతోంది. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లను అందించే ఏర్పాట్లు చేసినట్టు రియల్ మీ కంపెనీ వివరిస్తోంది.