Satya OTT: విడుదలైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ..!

సత్య చిత్రంలో హమరేష్, ప్రార్ధన జంటగా నటించారు. సత్య చిత్రానికి వాలీ మోహన్ దాస్ దర్శకుడు. ఇక సత్య కథ విషయానికి వస్తే... సత్య(హమరేష్) తెలివైన స్టూడెంట్.

Written By: S Reddy, Updated On : May 15, 2024 1:51 pm

Satya OTT

Follow us on

Satya OTT: ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పొచ్చు. ఓ క్రేజీ మూవీ విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఆ చిత్రం ఏమిటో కాదు సత్య. మే 10 థియేటర్స్ లోకి వచ్చాయి కృష్ణమ్మ, ప్రతినిధి 2, సత్య. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సత్య యువతను ఆకర్షించింది. స్టార్ క్యాస్ట్ లేకపోయిన ప్రమోషన్స్ గట్టిగానే చేశారు. అయితే సత్య ఆశించిన స్థాయిలో ఆడలేదు. సత్య తమిళంలో విజయం సాధించిన రంగోలి చిత్రానికి డబ్బింగ్ వెర్షన్.

తమిళంలో విజయం సాధించిన కథ తెలుగులో వర్క్ అవుట్ కాలేదు. ఈ క్రమంలో అనుకున్న సమయానికి కంటే ముందే సత్య ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు సమాచారం. సత్య మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. దాంతో మే చివరి వారం లేదా జూన్ మొదటివారంలో డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తున్నారట.

సత్య చిత్రంలో హమరేష్, ప్రార్ధన జంటగా నటించారు. సత్య చిత్రానికి వాలీ మోహన్ దాస్ దర్శకుడు. ఇక సత్య కథ విషయానికి వస్తే… సత్య(హమరేష్) తెలివైన స్టూడెంట్. చదువుల్లో, ఆటల్లో చురుగ్గా ఉంటాడు. అదే సమయంలో ఫ్రెండ్స్ గొడవలు, సరదాలు కూడా ఉంటాయి. తరచుగా సత్య గొడవల్లో తలదూరుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ కి కూడా వెళతాడు. లాభం లేదని తండ్రి ప్రైవేట్ స్కూల్ కి మార్చుతాడు. హోటల్స్ లో లాండ్రీ పని చేసే సత్య తండ్రి అప్పులు చేసి మరీ ఓ కార్పొరేట్ స్కూల్ లో చేర్చుతాడు.

అక్కడ కూడా సత్య గొడవలు పడటం మానడు. తన క్లాస్ మేట్ గౌతమ్ సత్యను టార్గెట్ చేస్తాడు. అదే సమయంలో పార్వతి(ప్రార్థన)ని ఇష్టపడతాడు. ఆమెకు కూడా సత్య అంటే ఇష్టం. ఒకరోజు టాయిలెట్ గోడ మీద పార్వతి ప్రేమిస్తున్న విషయం రాస్తాడు. అది గొడవకు దారి తీస్తుంది. పార్వతి కూడా సత్యపై కోప్పడుతుంది. అనంతరం ఓ ఊహించని పరిణామం చోటు చేసుకుంటుంది. అందేంటి? పార్వతి, సత్య జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది మిగతా కథ..