https://oktelugu.com/

Kangana Ranaut: 7 కిలోల బంగారం.. 60 కిలోల వెండి.. కంగనా ఆస్తులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

కంగనా రనౌత్ చరాస్తుల వివరాలను పరిశీలిస్తే, అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆమె పేరు మీద ఒకటి రెండు కాదు, 50 ఎల్‌ఐసీ పాలసీలున్నాయి, ఈ పాలసీలన్నీ జూన్ 4, 2008న కొనుగోలు చేసింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 15, 2024 / 01:59 PM IST

    Kangana Ranaut

    Follow us on

    Kangana Ranaut: బాలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్ అయిన కంగనా రౌనత్ రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. మంగళవారం (మే 14)న హిమాచల్ ప్రదేశ్‌లోని ‘మండి’ లోక్‌సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున నామినేషన్ దాఖలు చేసింది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండుగ అని, మండి నుంచి పోటీ చేయడం గర్వంగా ఉందని తన నామినేషన్ ర్యాలీలో చెప్పింది.

    ఆమె సమర్పించిన అఫిడవిట్ లో తన పర్సనల్ విషయాలతో పాటు ఆస్తి వివరాలను సమర్పించారు. బాలీవుడ్ లో భారీ ఆదరణ ఉన్న నటిగా ఆమె సంపాదన కూడా అదే రీతిలో ఉంది. రాజకీయాలపై బహిరంగ అభిప్రాయాలు ఉన్న కంగనా 23 మార్చి, 1987న హిమాచల్‌లోని మండి జిల్లాలో జన్మించారు. కంగనా రనౌత్ నికర ఆస్తి విలువ రూ. 90 కోట్లకు పైగా ఉన్నట్లు పేర్కొంది.

    17 కోట్లు అప్పులు
    12వ తరగతి ఉత్తీర్ణులైన కంగనా రనౌత్ వద్ద రూ. 2 లక్షల నగదు, అన్ని బ్యాంకు ఖాతాలు, షేర్లు-డిబెంచర్లు, ఆభరణాలతో సహా మొత్తం చరాస్తులు రూ. 28,73,44,239. కాగా స్థిరాస్తి రూ.62,92,87,000. కంగనాకు రూ. 17,38,00000 వరకు అప్పుకూడా ఉందట.

    కోట్ల విలువైన బంగారు-వజ్రాభరణాలు, లగ్జరీ కార్లు
    ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కంగనా రనౌత్ వద్ద 6 కిలోల 700 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని, వాటి విలువ రూ. 5 కోట్లు వరకు ఉంటుందని తెలిపింది. ఇది కాకుండా 60 కిలోల వెండి, దీని విలువ రూ.50 లక్షలు. రూ. కోటి విలువైన వజ్రాభరణాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 3 కోట్లకు పైగా ఉంటుందని అఫిడవిట్ లో పేర్కొంది.

    కంగనా కు లగ్జరీ కార్లు అంటే ఇష్టం. ఆమె కార్ల సేకరణలో చాలా వాహనాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో రెండు కార్లను ప్రస్తావించారు. వాటిలో ఒకటి BMW 7-సిరీస్, మరొకటి Mercedes Benz GLE SUV. ఈ రెండు కార్ల ధర రూ.1.56 కోట్లుగా చెప్పింది.

    50 ఎల్‌ఐసీ పాలసీలు
    కంగనా రనౌత్ చరాస్తుల వివరాలను పరిశీలిస్తే, అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆమె పేరు మీద ఒకటి రెండు కాదు, 50 ఎల్‌ఐసీ పాలసీలున్నాయి, ఈ పాలసీలన్నీ జూన్ 4, 2008న కొనుగోలు చేసింది. ఆమె షేర్లలో కూడా పెట్టుబడి పెట్టింది. ‘మణికర్ణిక ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌’లో 9999 షేర్లను కలిగి ఉంది. ఇందులో మొత్తం పెట్టుబడి మొత్తం రూ. 1.20 కోట్ల కంటే ఎక్కువని తెలిపింది.

    సినిమాల ద్వారానే..
    కంగనా రనౌత్ బాలీవుడ్‌లోని అత్యంత ధనవంతురాలైన, ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్. కంగనా ఒక సినిమాకు రూ. 15 కోట్ల నుంచి రూ. 25 కోట్ల వరకు తీసుకుంటుంది.

    యాడ్స్ ద్వారా కూడా..
    నికర విలువలో ఎక్కువ భాగం సినిమాల్లో నటించడం ద్వారా ఆమెకు ఆదాయం వస్తుంది, మరోవైపు ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా చాలా సంపాదిస్తుంది. నివేదికల ప్రకారం, కంగనా రనౌత్ ఒక బ్రాండ్ ప్రమోట్ కోసం రూ. 3 కోట్ల నుంచి రూ. 3.5 కోట్ల వరకు వసూలు చేస్తుంది. కంగనా కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాత కూడా వ్యవహరిస్తున్నారు. ఇది కూడా ఆమె ఆదాయానికి దోహదం చేస్తుంది.

    ముంబై నుంచి మనాలి వరకు నివాసాలు
    కోట్ల నికర విలువ కలిగిన కంగనా రనౌత్‌కు హిమాచల్‌లోని మనాలిలో విలాసవంతమైన బంగ్లా ఉంది, దీని ధర రూ. 25 కోట్లు. ఇది కాకుండా, ముంబైలో 5 బెడ్రూం గదుల అపార్ట్‌మెంట్ ఉంది. దీని ధర రూ. 15 నుంచి రూ. 20 కోట్ల. ముంబైలోని పాలిహిల్‌లో పెద్ద ఆఫీస్ స్పేస్ ఉంది, అది కూడా కోట్లలో ఉంటుంది.