Realme GT 6: రియల్‌ మీ GT 6 అదిరిపోయే ఫీచర్లు.. ఆకట్టుకునే ఆకృతి.. ధర ఎంతంటే..

GT 6 స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్, బ్యాటరీ, కూలింగ్ టెక్ వివరాలను రియల్ మీ వెల్లడించింది. ఇందులో క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ Snapdragon 8s Gen3 ప్రవేశపెట్టినట్టు realme ప్రకటించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 12, 2024 9:34 am

Realme GT 6

Follow us on

Realme GT 6: భారత మార్కెట్ లో ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు realme కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే GT 6 మోడల్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ కు సంబంధించి కీలకమైన ఫీచర్లను టీజర్ ద్వారా వెల్లడించింది. దీంతో ఈ ఫోన్ పై కస్టమర్లకు అంచనాలను మరింత పెంచింది. ఈ ఫోన్ ను AI power (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్) ద్వారా మార్కెట్లోకి తీసుకు వస్తున్నట్టు realme కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ ను “పిక్ పెర్ఫార్మెన్స్ ట్రయోగా” చెబుతోంది.

లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్

GT 6 స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్, బ్యాటరీ, కూలింగ్ టెక్ వివరాలను రియల్ మీ వెల్లడించింది. ఇందులో క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ Snapdragon 8s Gen3 ప్రవేశపెట్టినట్టు realme ప్రకటించింది. ఈ చిప్ సెట్ cortex – x4 ఆల్ట్రా లాడ్జ్ కోర్ సిస్టం కలిగియుండి.. 4nm ఫ్యాబ్రికేషన్ తో ఆకట్టుకుంటున్నది. ఈ వేగవంతమైన ప్రాసెసర్ కి lpdr 5x ర్యామ్, వేగవంతమైన UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది.

కూలింగ్ సిస్టం

ఈ ఫోన్ లో అతిపెద్ద కూలింగ్ సిస్టం ఉంది. బహుశా ప్రపంచంలో ఉన్న స్మార్ట్ ఫోన్లలో దీనికి ఉన్నట్టుగా కూల్ సిస్టం, మరొక దానికి లేదు. ఈ ఫోన్లో 10014 mm2 డ్యూయల్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కలిగి ఉంది.. దీనివల్ల ఫోన్ వేడెక్కదని, ఒకవేళ వేడెక్కినప్పటికీ వెంటనే చల్లబరిచే వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదని కంపెనీ చెబుతోంది.

బ్యాటరీ

ఈ ఫోన్లో అతిపెద్ద 500 mAh బిగ్ బ్యాటరీ ఉంది. ఈ పెద్ద బ్యాటరీ సైతం వేగంగా చార్జ్ చేసే 120W సూపర్ ఉక్ ఛార్జ్ ఈ ఫోన్లో ఉంది.. దీనివల్ల వెంటనే ఫోన్ చార్జ్ అవుతుంది. ఫోన్ అదే పనిగా వాడినప్పటికీ చార్జింగ్ వెంటనే దిగిపోదు.. పైగా ఏకకాలంలో బహుళ పనులు ఈ ఫోన్ ద్వారా చేసుకోవచ్చు.

ఇవి మూడే కాక ఈ ఫోన్లో కర్వ్ డ్ డిస్ ప్లే ఉంది. సోనీ ఫ్లాగ్ షిఫ్ట్ అల్ట్రా నైట్ కెమెరా ను ఈ ఫోన్లో పొందుపరిచినట్టు realme ప్రకటించింది. ఇంకా ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలను జూన్ 13న విడుదల చేస్తామని realme వెల్లడించింది.. ధర ఎంత అనేది ఖరారు చేయకపోయినప్పటికీ.. 25,000 నుంచి ఫోన్ సామర్థ్యం ఆధారంగా 45 వేల వరకు విక్రయించే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.