https://oktelugu.com/

Rajasthan: భర్తను, ఐదుగురు పిల్లలను వదిలి.. ఏం చేసిందంటే? ఛీ అంటున్న గ్రామస్తులు..

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లా పరిధిలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని మారుమూల గ్రామంలో నివసించే 32 ఏళ్ల మహిళ ఇన్‌ స్టాలో రీల్స్ చేసుకుంటూ కుటుంబంతో కలిసి జీవించేది.

Written By:
  • Neelambaram
  • , Updated On : June 12, 2024 / 09:41 AM IST

    Rajasthan

    Follow us on

    Rajasthan: స్మార్ట్ ఫోన్ సృష్టించిన విధ్వంసమో లేక.. వయస్సు మనస్సు ఇంకో తోడు కోరుకోవడమో కారణం ఏదైనా ఈ మధ్య మహిళలు ప్రవర్తించే తీరు సమాజాన్ని కలవరపాటుకు గురిస్తోంది. భర్త, పిల్లలు, కొందరు అత్తమామలతో కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ ఉండాల్సిన వారు శారీరక సుఖాలకు లొంగి, రీల్స్ లో కనిపించిన వారితో లేచిపోతూ కుటుంబాన్ని గాలికి వదులుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నా.. రాజస్థాన్ లో మరోటి వెలుగు చూసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

    రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లా పరిధిలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని మారుమూల గ్రామంలో నివసించే 32 ఏళ్ల మహిళ ఇన్‌ స్టాలో రీల్స్ చేసుకుంటూ కుటుంబంతో కలిసి జీవించేది. ఈ రీల్స్ తో వేలాది మంది ఫాలోవర్స్ వచ్చారు. ఈమెకు ఇన్ స్టాలో ఒక యువకుడితో స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో తన పిల్లలను, భర్తను, కుటుంబాన్ని వదిలి అతని కోసం ఇళ్లు వదిలిపెట్టి వెళ్లిపోయింది. సదరు వ్యక్తి గుజరాత్ లో ఉంటాడని తెలుసుకొని అక్కడికి వెళ్లి అతనితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంది.

    జైసల్మేర్‌లోని కీతా గ్రామానికి చెందిన నేమి దేవిని గజేసింగ్ కీ ధానికి చెందిన నరనారామ్ భీల్ తో వివాహం జరిగింది. ప్రస్తుతం నేమి దేవి వయస్సు 32 సంవత్సరాలు. ఆమె చదువుకోలేదు. కానీ స్మార్ట్ ఫోన్ వాడకం, రీల్స్ చేయడం, వాటిని సెండ్ చేయడం లాంటివి నేర్చుకుంది. డాన్స్ రీల్స్ ఇన్‌ స్టాలో పోస్ట్ చేసేది. దీంతో ఆమెకు 40 వేల మందికి పైగా ఫాలోవర్లు వచ్చారు. ఇందులో ఒకరు భీమారామ్‌. ఇతను నేమి దేవి ఫాలోవర్స్ లో చేరాడు. ఇలా పరిచయం పెంచుకున్నాడు, మెల్ల మెల్లగా ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ తర్వాత వారు ప్రేమలో పడ్డారు. ఏడాదిన్నరగా ఇద్దరి మధ్య ఎఫైర్ కొనసాగింది.

    ఈ నేపథ్యంలో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. నేమి దేవి తన ఇల్లు వదిలి ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత ఆమె భర్త జైసల్మేర్‌లోని సదర్ పోలీస్ స్టేషన్‌లో తన భార్య మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. పోలీసులు నేమి దేవి కోసం వెతకడం ప్రారంభించారు. సోమవారం (జూన్ 10) బార్మర్ జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్‌ పరిధిలో తన ప్రేమికుడితో కలిసి నేమీ దేవి కనిపించింది. సదరు మహిళా పోలీస్ స్టేషన్ సదర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించింది.

    భర్తతో విసిగిపోయే..
    తన భర్త తనను కొట్టేవాడని, హింసించేవాడని నేమి దేవి చెప్పింది. దీనికి తోడు అనుమానం కూడా ఉందని, ఐదుగురు పిల్లలు ఉన్నా తనకు నిత్యం హింసించేవాడని, వీటితో విసిగిపోయి. ఇన్‌ స్టాలో పరిచయమైన భీమారామ్‌తో కలిసి బతకాలని నిర్ణయించుకున్నానని వచ్చేశానని చెప్పింది.

    ఇన్‌ స్టాలో చాటింగ్‌ చేస్తూ నెంబర్లు మార్చుకున్నామని భీమారామ్ చెప్పాడు ప్రేమలో పడిపోయిన. మేమిద్దరం గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవించడం ప్రారంభించాం. ఇరు కుటుంబాలు కూడా మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చాయి. ఇప్పుడు వారు పెళ్లి చేసుకుని కలిసి జీవించాలనుకుంటున్నారు. పోలీసులు వారి వాంగ్మూలాలు తీసుకొని విడిచిపెట్టారని జైసల్మేర్ సదర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జగదీష్ దాన్ తెలిపారు.