Realme 16 Pro 5G: నేటి కాలంలో ధర తక్కువ ఉండాలి. ఫీచర్లు ఎక్కువ ఉండాలి. అప్డేట్స్ పరంగా ఎటువంటి తేడా రాకూడదు. వాడుతున్నంత సేపు అద్భుతమైన అనుభూతి అందించాలి.. ఇదిగో యూజర్ల ఆసక్తులు ఇలా ఉన్నాయి కాబట్టి కంపెనీలు కూడా అదే స్థాయిలో ఫోన్లను తయారు చేస్తున్నాయి. అలాంటి ఫోనే ఇది కూడా. 2026 ప్రారంభంలోనే దుమ్ము రేపుతున్న ఈ ఫోన్.. ఇయర్ ఎండింగ్ వరకు బీభత్సమైన సేల్స్ సొంతం చేసుకుంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు .
స్మార్ట్ ఫోన్లు వాడే వాళ్లకు రియల్ మీ (Realme 16 Pro 5G) కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎన్నో ఆసక్తికరమైన ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసిన ఈ కంపెనీ.. తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి ఈ ఏడాది రియల్ మీ 16 ప్రో పేరుతో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది.. 16 ప్రో సిరీస్ లో 2 వేరియంట్లను రియల్ మీ ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ లలో 200 మెగా పిక్సెల్ పవర్ ఫుల్ కెమెరా, 7000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.. ఇంకా ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ధర ఎంతంటే?
రియల్ మీ తీసుకొచ్చిన ఈ ఫోన్లలో బేసిక్ మోడల్ ధర 31, 999గా ఉంది. ఇందులో 8gb రామ్+ 128 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉన్నాయి. 8 జి బి రామ్+ 256 జిబి ఇంటర్నల్ మెమొరీ ఉన్న ఫోన్ ధర 33,999 , 12 జీబీ రామ్+ 256 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉన్న మోడల్ ధరను 36,999 గా రియల్ మీ కంపెనీ పేర్కొంది. మాస్టర్ గోల్డ్, పేబల్ గ్రే, ఆర్కిడ్ పర్పుల్ రంగులలో ఈ ఫోన్లు లభిస్తాయి.
ముందస్తు బుకింగ్స్
రియల్ మీ కంపెనీ ఈ మూడు మోడల్ ఫోన్ల ముందస్తు బుకింగ్స్ మొదలు పెట్టింది. లాంచింగ్ ఆఫర్ కింద 1500 రూపాయల బ్యాంక్, 2000 రూపాయల అదనపు ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్లు ఇస్తోంది. ఈ ఫోన్ తో పాటు రియల్ మీ బడ్స్ టి200 ఇయర్ బడ్స్ ఉచితంగా ఇస్తుంది.
అదనపు ఫీచర్లు ఏంటంటే
ఇందులో 7.5 ఎంఎం సూపర్ స్లీక్ మాస్టర్ డిజైన్ ఉంది. 6.78 అంగుళాల ఆమోలెట్ డిస్ప్లే ఉంది. 1.5 కే రిజల్యూషన్, 144 హెచ్ జెడ్ రీ ఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటివి ఉన్నాయి. ఆకట్టుకునే సెన్సార్ స్క్రీన్ ఫీచర్ ఉంది. ఇందులో ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వల్ల గేమింగ్, ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయుక్తంగా ఉంటుంది.
వేగవంతమైన పెర్ఫార్మెన్స్
రియల్ మీ లో మీడియా టెక్ లేటెస్ట్ చిప్ సెట్ Dimensity 7330 Max 5 ఉంది. ఇది అత్యంత వేగవంతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ చిప్ సెట్ ను వేగంగా మార్చే రియల్ మీ UI 7.0 software, Android 16 OS కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 12gb ర్యామ్, 256 జిబి స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ కెమెరా లో 200 ఎంపీ లూమా కలర్ మెయిన్ సెన్సార్, 8mp వైడ్ యాంగిల్ కవర్ చేసే రియర్ కెమెరా, 50 మెగా ఫిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 30 ఎఫ్ వద్ద కూడా ఈ ఫోన్ సూపర్ స్టేబుల్ ఫోర్ కె వీడియోలు, సూపర్ జూమ్ ఫోటోలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో ఆకట్టుకునే ఇమేజ్ ఎడిటింగ్ కోసం ఏఐ ఎడిట్ జీని 2.0 సపోర్ట్ కూడా ఉంటుంది.
క్షణాలలోనే చార్జింగ్
ఈ ఫోన్ 7000 ఎమ్ హెచ్ బిగ్ టైటాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. 80 వాట్స్ సూపర్ ఫ్లాష్ చార్జ్ సపోర్ట్ వల్ల వేగంగా చార్జ్ అవుతుంది. IP 66, IP 69, IP 69k rating వల్ల 36 లిక్విడ్స్ ను తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా దీనికి ఉంది. ఈ ఫోన్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ కూడా ఉంది. అది 300% ఆల్ట్రా వేల్యూమ్ ను అందిస్తుందని రియల్ మీ కంపెనీ చెబుతోంది.