Rafel Jets : సాధారణంగా అంతరిక్షంలోకి ఒక రాకెట్ ను ప్రయోగించినప్పుడు దానికి ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ అంతరిక్ష సంస్థలు ఒక రాకెట్ కోసం సెక్యూరిటీగా విమానాలను పంపించిన దాఖలాలు లేవు. కానీ తొలిసారిగా ఐరోపా అంతరిక్ష కేంద్రం తను పంపించిన రాకెట్ కోసం ఏకంగా యుద్ధ విమానాలనే సెక్యూరిటీగా పంపింది. పైగా ఈ ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం మొదలుపెట్టింది.. ప్రపంచంలోనే ఇలాంటి ఘటన తొలిసారిగా జరగడం పట్ల సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఐరోపా అంతరిక్ష కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆ సమాధానంతో ఆశ్చర్య పోవడం శాస్త్రవేత్తల వంతయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
రాకెట్ ప్రయోగం చేపట్టింది
ఐరోపా అంతరిక్ష కేంద్రం ఇటీవల నింగిలోకి ఒక రాకెట్ ను పంపించింది. ప్రయోగ మొత్తం సజావుగా సాగుతోందని శాస్త్రవేత్తలు భావించారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. మిఠాయిలు కూడా పంచుకున్నారు. అయితే వారి ఆనందం ఆవిరి అవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ రాకెట్ లో ఉన్నట్టుండి సాంకేతిక లోపం మొదలైంది. దీంతో శాస్త్రవేత్తల్లో ఆందోళన నెలకొంది. వందల కోట్లు ఖర్చు చేసి రూపొందించిన రాకెట్ గతి తప్పుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు వినూత్నమైన ఆలోచన చేశారు. వెంటనే ఆ రాకెట్ కు రక్షణగా ఫైటర్ జెట్లను రంగంలోకి దింపారు. రాకెట్ నింగిలోకి వెళ్తుండగా.. రఫెల్ యుద్ధ విమానాలు సెక్యూరిటీ ఇచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ రాకెట్ వెళుతుంటే అంగరక్షకుల లాగా నింగిలోకి దూసుకెళ్లాయి.
అనుకున్న సమయం కంటే గంట ఆలస్యంగా..
ఫ్రెంచ్ గయానాలోని కోరోవ్ లో ఐరోపా స్పేస్ పోర్ట్ ఉంది. ఇక్కడి నుంచి ఐరోపా అంతరిక్ష సంస్థ జూలై 9న నింగిలోకి ఏరియన్ 6 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. వాస్తవానికి ముందుగా అనుకున్న సమయం కంటే ఒక గంట ఆలస్యంగా ఈ రాకెట్ ను ఐరోపా అంతరిక్ష సంస్థ నింగిలోకి పంపించింది. నిప్పులు చిమ్ముకుంటూ ఆ రాకెట్ నింగిలోకి వెళ్లిన అనంతరం శాస్త్రవేత్తలు ఎగిరి గంతేశారు. ప్రయోగం విజయవంతమైందని జబ్బలు చరచుకున్నారు. అలా ఆ రాకెట్ అని హిందీలోకి వెళ్లిన కొంతసేపటికి సాంకేతిక లోపం తలెత్తింది. అప్పటికే అది భూమి వాతావరణాన్ని దాటిపోయింది. రాకెట్ చివరి పేలోడ్ విడుదల చేయకుండా నిర్దేశించిన మార్గం నుంచి దారితప్పింది. అయితే ఆ రాకెట్ ను తిరిగి భూమి మీదికి తీసుకురావాలని శాస్త్రవేత్తలు ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇదే దశలో శాస్త్రవేత్తల బృందం పరిస్థితిని ముందుగానే అంచనా వేసింది. వెంటనే ఫ్రాన్స్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ సహాయం కోరింది. దీంతో ఈ ప్రయోగానికి ముందే అక్కడి ఎయిర్ ఫోర్స్ ముందుగానే మోహరించింది. మూడు రఫెల్ యుద్ధ విమానాలను, రెండు యూరో కాప్టర్ ఫెన్నిక్స్, జర్మనీకి చెందిన ఒక పూమా ఇన్ ఫాంట్రీ ఫైటింగ్ వాహనం నింగిలోకి దూసుకెళ్లాయి. రాకెట్ వెళ్తున్న మార్గంలోనే అవన్నీ సెక్యూరిటీ కల్పించాయి. అయితే రాకెట్ దారి తప్పడంతో ఆకాశం లేదా భూమిపై ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని.. దానిని నిరోధించేందుకే వీటిని పంపించారు.. అయితే శాస్త్రవేత్తల అంచనా తప్పి రాకెట్ నేరుగా సముద్రంలోకి వెళ్లిపోయింది. అయితే ఆ రాకెట్ కోసం తోడుగా సెక్యూరిటీ యుద్ధ విమానాలు వెళుతున్న దృశ్యాలు రఫెల్ జెట్ విమానంలోని కాక్ పిట్ లో రికార్డ్ అయ్యాయి. వాటిని ఫ్రాన్స్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ ట్విట్టర్ ఎక్స్ లో షేర్ చేసింది. ఆపరేషన్ విజయవంతమైందని ఆ ట్వీట్ లో పేర్కొంది.
Mardi 9 juillet 2024, à 16 heures, heure locale, la fusée #Ariane6 a été lancée depuis le Centre spatial guyanais, à Kourou. Avec six de ses aéronefs, l’AAE a contribué à la protection de cette « opération névralgique ».
Retour sur cette mission accomplie avec succès. ⤵️ pic.twitter.com/9lQEeHUBeK
— Armée de l’Air et de l’Espace (@Armee_de_lair) July 19, 2024