Homeక్రీడలుక్రికెట్‌Champions Trophy 2025 : పాక్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన బీసీసీఐ.. దాయాది జట్టు...

Champions Trophy 2025 : పాక్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన బీసీసీఐ.. దాయాది జట్టు గుక్క పెట్టి ఏడవడమే ఇక..

Champions Trophy 2025 :  ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలని.. తెగ ఉత్సాహపడుతున్న దాయాది పాక్ జట్టును బీసీసీఐ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. వచ్చే ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు ఒక బ్లూ ప్రింట్ పంపించింది. ఇందులో భారత జట్టు ఆడే మ్యాచ్ లను లాహోర్ వేదికగా నిర్వహిస్తామని పేర్కొంది. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి మండిపడింది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ వెళ్ళేది లేదని స్పష్టం చేసింది. దీంతో తమకు కారణం చెప్పాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీని ఆశ్రయించింది. ఫలితంగా బీసీసీఐ రెండు దేశాల మధ్య ఉన్న పరిస్థితులను ఐసీసీకి వివరించింది. ప్రభుత్వం ఒప్పుకుంటే తమ జట్టును పాకిస్తాన్ పంపిస్తామని పేర్కొంది. భారత ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ లో భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ ఆడేది అనుమానంగా మారింది. ఇదే క్రమంలో భారత జట్టు తమ దేశంలో క్రికెట్ ఆడేందుకు రావాలని పాకిస్తాన్ విశ్వ ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ లో ఆడితే యాడ్స్ రూపంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు దండిగా ఆదాయం వస్తుంది. అయితే ఈ విషయం ముందే తెలిసిన బీసీసీఐ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేస్తున్న ప్రయత్నాలకు ఎక్కడికి అక్కడ పెట్టడం మొదలుపెట్టింది. చివరికి బీసీసీఐ కి ఐసీసీ అండగా నిలిచింది.

పుండు మీద కారం చల్లినట్టు

ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ లో ఆడబోమని చెప్పడం.. తెరపైకి హైబ్రిడ్ విధానాన్ని ఐసీసీ ఎదుటకు తీసుకురావడంతో మండిపడుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డును భారత క్రికెట్ నియంత్రణ మండలి మరో షాక్ ఇచ్చింది. వచ్చేయడాది మన దేశం వేదికగా జరిగే ఆసియా కప్ కు పాకిస్తాన్ రావలసిన పరిస్థితిని కల్పించింది. 2025లో టి20 ఫార్మాట్ లో ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. దాదాపు 34 సంవత్సరాల తర్వాత తొలిసారి ఆసియా టోర్నీ నిర్వహణకు భారత్ వేదిక కానుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడాల్సిన పరిస్థితిని కల్పించే బాధ్యతను ఇప్పటినుంచే బీసీసీఐ భుజాలకు ఎత్తుకుంది. ఇందులో భాగంగా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పై బీసీసీఐ ఒత్తిడి తేవడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ ఇటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు బీసీసీఐ ఎక్కడికక్కడే కట్టడి చేస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్ కనుక బీసీసీఐ మాటను జవదాటితే ఆర్థికంగా తీవ్ర నష్టం తప్పదు. గత 16 సంవత్సరాలుగా పాకిస్థాన్ లో భారత్ పర్యటించడం లేదు..

పాక్ పప్పులు ఉడకలేదు..

ఇక ఆసియా కప్ 1984లో మొదలైంది. భారత్ 1990-91 కాలంలో ఆసియా కప్ ను హోస్ట్ చేసింది. ఆ తర్వాత మన దేశం వేదికగా ఆసియా కప్ ఇంతవరకూ జరగలేదు. వచ్చే ఏడాది టి20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. ఇక 2027లో వన్డే ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇస్తుంది. ఇక వచ్చే ఏడాది ఐసీసీ చాంపియన్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా మొదలుకానుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. లాహోర్ వేదికగా భారత్ ఆడే మ్యాచ్ లు నిర్వహిస్తామని, పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెప్పింది. మన దేశానికి చెందిన మాజీ క్రికెటర్లతో బీసీసీఐకి విజ్ఞప్తి చేయించింది. అయినప్పటికీ బీసీసీఐ మెత్తబడలేదు. చివరికి హైబ్రిడ్ విధానంలోనే భారత్ ఆడే మ్యాచ్ లు నిర్వహించాలని బీసీసీఐ స్పష్టం చేసింది. బీసీసీఐ నిర్ణయానికి ఐసీసీ కూడా ఓకే చెప్పింది. దీంతో పాక్ పప్పులు బీసీసీఐ ఎదుట ఉడకలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version