https://oktelugu.com/

PVC Aadhar Card : ఆధార్ ను పీవీసీ కార్డుగా ఎలా పొందాలి? ఎంత ఖర్చవుతుంది?

గూగుల్ లోకి వెళ్లి uidai అని టైప్ చేయాలి. ఇందులో ఫస్ట్ లింక్ ను క్లిక్ చేయాలి. ముందుగా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడో ఓ పేజీ ఓపెన్ అవుతుంది.

Written By: , Updated On : March 2, 2024 / 03:26 PM IST
Pvc aadhar card

Pvc aadhar card

Follow us on

PVC Aadhar Card : భారతదేశం డిజిటల్ మయం అయిపోతుంది. ప్రతీ పనిని సాంకేతికంగా పూర్తి చేస్తున్నారు. టెక్నాలజీతో పనులు ఈజీగా కావడంతో ప్రజలు దీనికి అలవాటు పడిపోయారు. అంతేకాకుండా ఒకప్పుడు ఏదైనా అవసరం తీరాలంటే రోజుల కొద్దీ వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏదైనా ఆన్ లైన్ ద్వారా ఈజీగా చేసుకోగలుగుతున్నారు. ప్రధానంగా ఏదైనా గుర్తింపు కార్డు కావాలంటే ఒకప్పు కనీసం నెల రోజులైనా సమయం పట్టేది. కానీ ఇప్పుడు వారం తిరగకముందే పొందగలుగుతున్నాం. అయితే గుర్తింపు కార్డును పేపర్ ద్వారా కాకుండా ఇప్పుడు పీవీసీ కార్డు తో ఇంటికి వస్తుంది. కానీ ఆధార్ కార్డు మాత్రం పేపర్ పై వస్తుంది. దీనిని పీవీసీ కార్డుగా మార్చుకోవాలంటే ఎలా?

డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లు పీవీసీ మోడల్ లో ఉంటాయి. ఇవి సౌకర్యంగానూ ఉండడంతో పాటు వర్షం పడినా చెడిపోకుండా ఉంటాయి. కానీ ఆధార్ కార్డు మాత్రం పేపర్ పైనే ఇంటికి వస్తుంది. ఒకవేళ దీనిని డూబ్లీకేట్ ద్వారా తయారు చేసుకోవాలంటే రూ. 100కు పైగానే ఉంటుంది. అయినా అది ఒరిజినల్ కార్డును పోలీ ఉండదు. అయితే ఒరిజినల్ నెంబర్స్ తో కూడిన ఆధార్ కార్డు పీవీసీ ద్వారా పొందాలంటే చిన్నపనిచేస్తే చాలు.. అదేంటంటే?

ఆన్ లైన్ ద్వారా పీవీసీ ఆధార్ కార్డును పొందవచ్చు. అదీ కేవలం రూ.50కి మాత్రమే. ఈ విషయం చాలా మందికి తెలియక ఇన్నాళ్లు పేపర్ కార్డుతో అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు పీవీసీ కార్డు పొందాలంటే ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకుంటే చాలు. అందుకోసం ముందుగా గూగుల్ లోకి వెళ్లి uidai అని టైప్ చేయాలి. ఇందులో ఫస్ట్ లింక్ ను క్లిక్ చేయాలి. ముందుగా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడో ఓ పేజీ ఓపెన్ అవుతుంది.

ఇందులో చివరగా ఉండే Order Pvc Card అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తరువాత పేమేంట్ ఆప్షన్ అడుగుతుంది. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ లింక్ ఉన్న బ్యాంకు డీటేయిల్స్ అడుగుతుంది. వాటి ద్వారా కేవలం రూ.50 మాత్రమే పేమెంట్ చేయడం ద్వారా పీవీసీ కార్డు ఇంటికే వస్తుంది. ఆ తరువాత దీనిని ఎలా ఉపయోగించినా పాడవకుండా ఉంటుంది.