https://oktelugu.com/

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాతో ఎన్టీయార్ సూపర్ హిట్ కొట్టడా..?

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు మహర్షి అనే సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయినప్పటికీ వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందే ఒక సినిమా రావాల్సింది.

Written By:
  • Gopi
  • , Updated On : March 2, 2024 / 03:26 PM IST
    Follow us on

    Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్న మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే మంచి సక్సెస్ లను అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇప్పటికే ఆయన తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్నాడు. అయితే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) మహర్షి అనే సినిమా చేశాడు.

    ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయినప్పటికీ వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందే ఒక సినిమా రావాల్సింది. అది ఏ సినిమా అంటే బృందావనం… నిజానికి వంశీ పైడిపల్లి ఈ సినిమాను మహేష్ బాబు ని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాడట… ఇక ఈ సినిమా స్టోరీ ని కూడా మహేష్ బాబుకి వినిపించాడట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మహేష్ బాబు ఈ సినిమాని చేయలేకపోయాడు. దాంతో ఈ సినిమా స్క్రిప్ట్ ను దిల్ రాజు జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పి ఆయన చేత ఈ సినిమాని చేయించాడు. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.

    నిజానికి ఎన్టీఆర్(NTR) కెరియర్ లో టాప్ 5 హిట్ సినిమాల్లో బృందావనం సినిమా కూడా ఒకటి అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమా మహేష్ బాబు కి కూడా చాలా బాగా సెట్ అయ్యేది. కానీ ఆయన రిజెక్ట్ చేయడం వల్ల ఎన్టీఆర్ కి ఒక భారీ సక్సెస్ దక్కిందనే చెప్పాలి…ఇలా ఒకరు చేయాల్సిన సినిమాలను మరొకరు చేసి భారీ సక్సెస్ లను అందుకున్న హీరోలు చాలామందే ఉన్నారు.

    కొంతమంది కొన్ని సినిమాలను వదిలేయడం వల్ల వాళ్లకు ప్లస్ అయితే, మరి కొంత మందికి మైనస్ లుగా కూడా మారిన సందర్భాలు ఉన్నాయి…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తుంటే, ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఇలా ఎవరికి వాళ్ళు సినిమాలు చేస్తు చాలా బిజీగా గడుపుతున్నారు…