Safety Cars: భద్రత ఇచ్చే కారు కొనాలనుకుంటున్నారా? ఈ కార్ల సేప్టీ రేటింగ్ ఎలా ఉన్నాయంటే?

కొన్ని కార్ల కంపెనీలు సైతం భద్రతను ప్రామాణికంగా తీసుకొని కార్లన ఉత్పత్తి చేస్తున్నారు. అయితే అత్యంత భద్రతను ఇస్తూ తక్కువ బడ్జెట్ లో లభించే కార్లు ఏవో తెలుసుకుందాం..

Written By: Srinivas, Updated On : March 2, 2024 3:30 pm

Safety Cars

Follow us on

Safety Cars:కారు కొనాలని ప్రతి ఒక్కిరికీ ఉంటుంది. కానీ ఏ కారు కొంటే బెటర్? అనే విషయంలో మాత్రం ఆగిపోతారు. కొందరు మంచి ఫీచర్స్ ఉండాలనుకుంటారు..మరికొందరు డిజైన్ బాగుండాలని కోరుకుంటారు. కానీ అందరూ కోరుకునేది మాత్రం సేప్టీ కారునే. కారులో దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అందువల్ల ప్రయాణికులు సేప్టీ కారు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కార్ల కంపెనీలు సైతం భద్రతను ప్రామాణికంగా తీసుకొని కార్లన ఉత్పత్తి చేస్తున్నారు. అయితే అత్యంత భద్రతను ఇస్తూ తక్కువ బడ్జెట్ లో లభించే కార్లు ఏవో తెలుసుకుందాం..

దేశంలో నెంబర్ వన్ గా ఉన్న మారుతి సుజుకీ కంపెనీకి ధీటుగా పోటీ ఇస్తోంది టాటా కంపెనీ. ఈ కంపెనీ నుంచి వచ్చిన టియాగో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ హ్యాచ్ బ్యాక్ కారు 4 స్టార్ Gncap రేటింగ్ ను పొందింది. ఇది పెట్రోల్ తో పాటు సీఎన్ జీలో లభించే కారు. దీని ధర రూ.5.60 లక్షల నుంచి రూ.8.15 లక్షల వరకు ఉంటుంది. ఇదే కంపెనీకి చెంది పంచ్ కూడా సేప్టీ కార్లలో ఒకటిగా నిలుస్తుంది. ఇది NCAPలో 5 స్టార్ రేటింగ్ పొందింది. దీనిని రూ.6 లక్షల నుంచి రూ.10.10 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల గురించి తెలియిన వారుండరు. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన XUV300 సేప్టీ కార్లలో ఒకటిగా నిలిచింది. దీనికి క్రాస్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. దీనిని రూ.8 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయిస్తున్నారు. రెనాల్ట్ కంపెనీకి చెందిన కిగర్ కూడా తక్కువ బడ్జెట్ లో వస్తూ ఎక్కువ భద్రతను ఇస్తుంది. ఇది NCAPలో 4 స్టార్ రేటింగ్ పొందింది. దీనిని రూ.6.50 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.11.23 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

నిస్సాన్ మాగ్నైట్ కారుకు సైతం క్రాష్ టెస్ట్ లో 4 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇది టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉండడం వల్ల ఎక్కువగా లైక్ చేస్తున్నారు. దీనిని రూ.6 లక్షల ప్రారంభం నుంచి రూ.11.02 లక్షల వరకు విక్రయిస్తున్నారు. స్కోడా నుంచి వచ్చిన స్లావిగా క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ పొందింది. దీనిని రూ.11.53 లక్షల ప్రారంభం నుంచి విక్రయిస్తున్నారు.