https://oktelugu.com/

ఫోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.2 లక్షల లాభం పొందే ఛాన్స్..?

ప్రస్తుత కాలంలో ఇతర స్కీమ్స్ తో పోలిస్తే పోస్టాఫీస్ స్కీమ్స్ మంచి రాబడిని అందిస్తుండటం గమనార్హం. కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎటువంటి రిస్క్ లేకుండా పోస్టాఫీస్ లు ఎన్నో స్కీమ్ లను ఆఫర్ చేస్తున్నాయి. ఎంచుకునే స్కీమ్, కాలపరిమితిని బట్టి ఆ స్కీమ్ ద్వారా పొందే ప్రయోజనాలలో మార్పులు ఉంటాయి. పోస్టాఫీస్ స్కీమ్స్ లో టైమ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి కాగా తక్కువ మొత్తం పెట్టుబడితో ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 19, 2021 / 12:14 PM IST
    Follow us on

    ప్రస్తుత కాలంలో ఇతర స్కీమ్స్ తో పోలిస్తే పోస్టాఫీస్ స్కీమ్స్ మంచి రాబడిని అందిస్తుండటం గమనార్హం. కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎటువంటి రిస్క్ లేకుండా పోస్టాఫీస్ లు ఎన్నో స్కీమ్ లను ఆఫర్ చేస్తున్నాయి. ఎంచుకునే స్కీమ్, కాలపరిమితిని బట్టి ఆ స్కీమ్ ద్వారా పొందే ప్రయోజనాలలో మార్పులు ఉంటాయి. పోస్టాఫీస్ స్కీమ్స్ లో టైమ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి కాగా తక్కువ మొత్తం పెట్టుబడితో ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది.

    పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతాకు సంబంధించి వడ్డీరేటును ప్రతి సంవత్సరం చెల్లించినప్పటికీ త్రైమాసికంలో వడ్డీరేటును చెల్లించడం జరుగుతుంది. ఈ పథకంలో గరిష్ట డిపాజిట్ పరిమితి లేకపోవడం వల్ల ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెపవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద వడ్డీరేట్లు 6.6 శాతంగా ఉన్నాయి. కాలపరిమితి ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి.

    5 సంవత్సరాల కాలపరిమితి ఖాతాకు ఏకంగా 7.4 శాతం వడ్డీరేటు లభిస్తోంది. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ఆదాయపు పన్ను చట్టం కింద ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 5 లక్షల రూపాయలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లలో 2.25 లక్షల రూపాయల లాభం పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా 7 లక్షల రూపాయలకు పైగా మెచ్యూరిటీ తర్వాత పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా ఈ ఖాతాను తెరిచే అవకాశం ఉంటుంది. బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడం కంటే ఈ విధంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎటువంటి రిస్క్ లేకుండా కచ్చితమైన ఆదాయం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.