Avika Gor: సినీ రంగం లో అత్యంత రిస్క్ తో కూడుకున్న బాధ్యత ఏదైనా ఉందా అంటే అది కేవలం నిర్మాణ రంగం మాత్రమే. హీరో హీరోయిన్ల పారితోషికం తో పాటుగా,జూనియర్ ఆర్టిస్టు దగ్గర నుండి డైరెక్టర్ వరకు అందరినీ మ్యానేజ్ చేస్తూ, డబ్బులు మంచి నీళ్లు లాగ ఖర్చుపెట్టాలి. వస్తే లాభం , లేకుంటే సంపాదించింది మొత్తం ఒకే ఒక్క రాత్రి లో ఆవిరైపోయి జీవితం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అందుకు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
సావిత్రి , సిల్క్ స్మిత , విజయ శాంతి ఇలాంటి స్టార్ హీరోయిన్లు ఒక పక్క నటిస్తూ, మరో పక్క నిర్మాణ రంగం లో చేతులు పెట్టి పూర్తి నష్టపోయారు. విజయశాంతి ఆర్థికంగా తట్టుకొని నిలబడినా, సావిత్రి మరియు సిల్క్ స్మిత తలరాతలు మారిపోయి రోడ్డున పడ్డారు. ఇప్పుడు ఒక కుర్ర హీరోయిన్ కి కూడా అదే పరిస్థితి వచ్చేది, కానీ తెలివిగా తప్పించుకుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, ‘ఉయ్యాలా జంపాల’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికా గోర్.
చిన్నారి పెళ్లికూతురు అనే పాపులర్ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అవికా గోర్, ఆ తర్వాత ‘సినిమా చూపిస్తా మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసి డబ్బులు బాగానే సంపాదించింది. అయితే ఈమె సంపాదించిన డబ్బులు మొత్తాన్ని ‘పాప్ కార్న్’ అనే సినిమాని నిర్మించడానికి ఉపయోహించింది.
ఆ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడమే కాకుండా, ఓటీటీ లో కూడా ఆ చిత్రాన్ని కొనుగోలు చెయ్యడానికి ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. అందువల్ల ఈమె పూర్తిగా నష్టపోయింది, ఒక్కే ఒక్క సినిమాతో వచ్చిన ఈ చేదు అనుభవం ని దృష్టిలో పెట్టుకొని, నిర్మాణ సంస్థని మూసేసింది. ఇక నుండి పొరపాటున కూడా అటు వైపు పోకూడదని నిర్ణయించుకుంది ఈ కుర్ర హీరోయిన్.