E-Bus : బామ్మ మాట బంగారు బాట.. ఆ సినిమా చూశారా? అందులో రాజేంద్రప్రసాద్, నూతన్ ప్రసాద్ కలిసి ప్రయాణించే కారు డ్రైవర్ లేకుండానే వెళ్తుంది. పైగా దానంతట అదే విడిపోతుంది. మళ్లీ కలుస్తుంది. చూడ్డానికి అప్పట్లో విచిత్రంగా ఉన్నప్పటికీ.. సినిమా కాబట్టి ఆ దర్శకుడు లిబర్టీ తీసుకున్నాడు. కానీ ఆ కారు స్థానంలో ఓ బస్సును ఊహించుకోండి? విడిపోయేంత కాదు గాని.. డ్రైవర్ లేకుండా నడుస్తుంది. ఇది కూడా సినిమా అనుకోకండి. నిజ జీవితంలో జరిగింది. యావత్ ప్రపంచం మొత్తం కళ్ళు అప్పగించి చూసింది.
బస్సు వెళ్తోంది.. స్టాప్ రాగానే ఆగింది.. కొందరు ప్రయాణికులు దిగారు.. మరికొందరు ఎక్కారు.. బస్సు సాగిపోతూనే ఉంది. దీంట్లో విశేషం ఏమిటనుకుంటున్నారా? ఆ బస్సులో డ్రైవర్ లేడు. కనీసం స్టీరింగ్ కూడా లేదు. అయినా, బస్సు నిరాటంకంగా నడుస్తూనే ఉంది. సైన్స్‌ఫిక్షన్ సినిమాల్లోనే కనిపించే ఇటువంటి బస్సు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నిజంగానే సాకారమైంది. పైలట్ ప్రాజెక్టు కింద అధికారులు ఈ బస్సును నడిపించారు. శుక్రవారం ట్రెజర్ అనే ద్వీపం చుట్టూ ఈ వినూత్న బస్సు చక్కర్లు కొట్టింది. ఎటువంటి సమస్య లేకుండా 20నిమిషాల వ్యవధిలో బస్సు ద్వీపాన్ని చుట్టింది. ఇది ఎలక్ట్రిక్ బస్సు. ఇందులో డ్రైవరు ఉండడు. ఒక అటెండెంట్ ఉంటాడు. అత్యవసర పరిస్థితి ఏదైనా తలెత్తితే ఈ అటెండెంట్ బస్సును అదుపులోకి తీసుకొస్తాడు.
పెరిగిపోతున్న కాలుష్యం వల్ల ఈ ఎలక్ట్రిక్ బస్సును కనిపెట్టారు. అమెరికాలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడ ప్రజా రవాణా వ్యవస్థ ఉండదు. పైగా జనాభా తక్కువ వైశాల్యం ఎక్కువ ఉండడం ఏ ప్రాంతానికి వెళ్లాలనుకున్నా విమానాల్లో ప్రయాణించాల్సిందే. పైగా అయా ప్రాంతాల మొత్తం వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అలాంటప్పుడు వ్యక్తిగత వాహనాలు అక్కడ సర్వసాధారణం. వాటికి ఇంధనం పోయాలి అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ క్రమంలోనే అక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు రూపొందాయి. అయితే మొన్నటి వరకు అది కార్ల వరకే పరిమితం అయ్యేది. తాజాగా అది బస్సుకు కూడా అప్ గ్రేడ్ కావడం.. కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ ప్రయోగం.. పూర్తి స్థాయిలో విజయవంతం అయితే అమెరికానే కాదు యావత్ ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు చక్కర్లు కొట్టడం ఖాయం.
San Francisco is rolling out driverless buses. The shuttle service bus will make seven stops daily around Treasure Island and can sit up to 10 passengers. pic.twitter.com/yj5BeDIJxN
— CBS Saturday Morning (@cbssaturday) August 19, 2023