IRE vs IND : భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో మ్యాచ్ లో వాన కారణంగా ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండడంతో పిచ్ పరిస్థితులు మారడమే కాకుండా రెండవసారి బ్యాటింగ్ కి దిగిన టీం ఇండియా ఇన్నింగ్స్ పూర్తిగా ఆడలేక ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలో కూడా డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో టీం ఇండియా విజయం సాధించింది. ఇదే పిచ్ పై జరగనున్న రెండవ మ్యాచ్ లో కూడా వాన కీలక పాత్ర పోషిస్తుందేమో చూడాలి.
మొదటి టీ20 మ్యాచ్ జరిగిన డబ్లిన్ వేదికగా జరుగుతున్న రెండవ మ్యాచ్ లో కూడ గెలవడం టీం ఇండియా లక్ష్యం. మామూలుగా బ్యాటర్లకు ఎంతో సహకరించే ఈ స్టేడియం పిచ్ మొదటి టీ20 మ్యాచ్ లో వాతావరణం కారణంగా కొంత ట్రిక్కీగా ఉంది. దీని కారణంగా స్కోర్ బోర్డు పరిగెత్తించడం బ్యాటర్లకు కష్టంగా మారింది. మరి రెండవ టీ20 మ్యాచ్ సమయంలో కూడా ఆకాశం పూర్తిగా మేఘావృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అంటే రెండవ టీ20 మ్యాచ్ కూడా లో-స్కోరింగ్ ఉండే అవకాశం ఉండొచ్చు. ఆదివారం వర్షం పడే అవకాశాలు పెద్దగా లేదు కానీ మ్యాచ్లో టాస్ ఎవరు గెలుస్తారు అనేది ఎంతో కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా చేజింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ మైదానంలో జరిగిన 17 మ్యాచ్ లలో పది మ్యాచ్లకు పైగా గెలుపు ఛేజింగ్ టీం కు దక్కింది.
గాయాల కారణంగా గత కొద్ది కాలంగా మ్యాచ్ కు దూరంగా ఉన్న బుమ్రా ఈ సిరీస్ తో తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి మ్యాచ్ లో కేవలం 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి భారత్ ఆటగాళ్లు కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ తొలి వికెట్ కి 46 పరుగుల స్కోర్ సాధించారు. కానీ తిలక్ వర్మ మాత్రం ఊహించిన విధంగా విజృంభించకుండా .. 0 రున్స్ తో గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు.
వాతావరణ శాఖ రిపోర్టు ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో 16 డిగ్రీల సెల్సియస్ నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండొచ్చు. అయితే వర్షం మాత్రం పడే అవకాశం ఏమాత్రం లేదు. దీని కారణంగా విచ్ బౌలర్లకు ఎంతో అనుకూలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ మ్యాచ్ లో కూడ గేలిస్తే ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సీరియస్ భారత్ కైవసం అవుతుంది. మరోపక్క ఈ మ్యాచ్ లో గెలిచి 1-1 స్కోర్ తో భారత్ కు టక్కర్ ఇవ్వాలని ఐర్లాండ్ భావిస్తోంది. దీంతో జరగబోయే రెండవ టీ20 మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారనుంది.