ఫోన్ పే యాప్ వాడుతున్న వాళ్లకు షాకింగ్ న్యూస్..?

దేశంలో సైబర్ మోసగాళ్ల మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఒక మోసం వెలుగులోకి వచ్చేసరికి సైబర్ మోసగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తూ మరో కొత్త మోసానికి తెర లేపుతున్నారు. దేశంలో డిజిటల్ వాలెట్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో సైబర్ మోసగాళ్లు డిజిటల్ వాలెట్ల సహాయంతోనే మోసాలకు పాల్పడుతుండటం గమనార్హం. నోట్ల రద్దు తరువాత చిన్న దుకాణాల నుంచి పెద్ద దుకాణాల వరకు డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. Also Read: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్..? […]

Written By: Navya, Updated On : April 6, 2021 11:27 am
Follow us on

దేశంలో సైబర్ మోసగాళ్ల మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఒక మోసం వెలుగులోకి వచ్చేసరికి సైబర్ మోసగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తూ మరో కొత్త మోసానికి తెర లేపుతున్నారు. దేశంలో డిజిటల్ వాలెట్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో సైబర్ మోసగాళ్లు డిజిటల్ వాలెట్ల సహాయంతోనే మోసాలకు పాల్పడుతుండటం గమనార్హం. నోట్ల రద్దు తరువాత చిన్న దుకాణాల నుంచి పెద్ద దుకాణాల వరకు డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి.

Also Read: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్..?

డిజిటల్ పేమెంట్స్ వల్ల క్షణాల్లో లావాదేవీలు జరుగుతుండటంతో లావాదేవీలు జరిపే వాళ్లకు సైతం ఇబ్బందులు తగ్గాయి. అయితే తాజాగా ఫోన్ పే యాప్ వాడుతున్న కస్టమర్ ను టార్గెట్ చేసి ఒక వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. గుంటూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి తన స్నేహితుడైన మరో వ్యక్తికి ఫోన్ పే యాప్ సహాయంతో 400 రూపాయలు పంపించాడు. నాగరాజు ఖాతాలో 400 రూపాయలు కట్ అయినా అవతలి వ్యక్తి ఖాతాలో నగదు జమ కాలేదు.

నాగరాజు కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి తన ఖాతాలో 400 రూపాయలు కట్ అయ్యాయని అవతలి వ్యక్తి ఖాతాలో నగదు జమ కాలేదని వెల్లడించాడు. కస్టమర్ కేర్ ప్రతినిధులు త్వరలోనే అతని ఫిర్యాదును పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ తరువాత ఒక అపరిచిత వ్యక్తి నుంచి నాగరాజుకు ఫోన్ కాల్ వచ్చింది. 400 రూపాయలు ఖాతాలో జమ చేస్తామని మొబైల్ కు వచ్చే వెరిఫికేషన్ కోడ్ చెప్పాలని అవతలి వ్యక్తి చెప్పాడు.

Also Read: మీ జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయిందా.. ఏం చేయాలంటే..?

నాగరాజు అపరిచిత వ్యక్తికి కోడ్ చెప్పిన వెంటనే అతని ఖాతా నుంచి రూ. 48,657 కట్‌ అయ్యాయి. డబ్బులు కట్ అయిన విషయం నాగరాజు అపరిచిత వ్యకికి చెప్పగా ఆ వ్యక్తి తాను మరో కోడ్ ను పంపుతున్నానని అ కోడ్ చెబితే డబ్బులు జమవుతాయని చెప్పాడు. ఆ తరువాత మళ్లీ నాగరాజు ఖాతా నుంచి రూ. 48,657 కట్‌ అయ్యాయి. నాగరాజు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 400 రూపాయల కోసం కాల్ చేసి నాగరాజు ఏకంగా 97 వేల రూపాయలు పోగొట్టుకోవడం గమనార్హం.