Asteroid 2024 pk2 : పైన ఉన్న ఆకాశం ఎన్నో అద్భుతాలకు నెలవు. ఆకాశంలో విస్తరించి ఉన్న అంతరిక్షంలో గ్రహాలు ఉన్నాయి. భూమి నుంచి మొదలుపెడితే గురుడు వరకు ఆకాశంలోనే విస్తరించి ఉన్నాయి. మన భూమ్మీద అద్భుతాలు ఎలా అయితే చోటు చేసుకుంటాయో.. ఆకాశంలోనూ అదే స్థాయిలో అద్భుతాలు జరుగుతుంటాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని కాలంలో ఆకాశంలో ఏం జరుగుతోందనేది ఎవరికీ తెలిసేది కాదు. ఫలితంగా భూమి పుట్టుక, ఇతర గ్రహాల కదలిక అంతుపట్టేది కాదు. కానీ ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఆకాశంలోకి ఉపగ్రహాలను పంపడం.. వాటి ద్వారా అంతరిక్షంలో చోటుచేసుకుంటున్న మార్పులను పసిగట్టడం.. సులభం అయిపోయింది. వాతావరణంలో మార్పులు, సెల్ ఫోన్ సిగ్నల్స్, శాటిలైట్ ద్వారా ఇతర సేవలు పొందడం పరిపాటిగా మారిపోయింది. ప్రస్తుతం మనం విరివిగా ఉపయోగిస్తున్న గూగుల్ మ్యాప్స్ కూడా శాటిలైట్ సేవలు ద్వారానే పొందుతున్నాం. ఆకాశంలో ఉన్న శాటిలైట్ల ద్వారా అంతరిక్షంలో చోటుచేసుకుంటున్న మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టే వీలవుతోంది. దాని ఆధారంగా భూమ్మీద చర్యలు తీసుకునేందుకు అవకాశం కలుగుతోంది.
ఈ శాటిలైట్ల ద్వారా భూమికి ఏర్పడే ముప్పు, దగ్గరగా వచ్చే ఉపగ్రహాలు, ఇతర గ్రహశకలాల గురించి తెలుసుకోవడం అత్యంత సులభం అయిపోయింది. ప్రస్తుతం భూమికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా దీనిని ధ్రువీకరించాయి. ఆగస్టు 12, సోమవారం రాత్రి 12 గంటల సమయంలో 2024 పీకే -2 అనే గ్రహశకలం భూమికి సమీపంలోకి వస్తుందని నాసా ప్రకటించింది. ఇది గంటకు 31,380 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది 83 అడుగుల పొడవు ఉంది. ఒక చిన్న పరిమాణంలో ఉన్న భవనం మాదిరి ఉన్న ఈ గ్రహశకలం.. భూమికి 12 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తోందని తెలుస్తోంది. భూ కక్ష్య లోకి వచ్చే ఆస్టరాయిడ్స్ ను అటెన్ గ్రూప్ అని పిలుస్తారు. ఇది కూడా ఆ గ్రూప్ నకే చెందిందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీనివల్ల భూగ్రహానికి పెద్దగా నష్టం వాటిల్లదని చెబుతున్న నాసా శాస్త్రవేత్తలు, అలాగని ప్రమాదం లేదని భావించకూడదని అంటున్నారు.
ఈ ఆస్టరాయిడ్ కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నాసా ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేస్తోంది. ” అంతరిక్షంలో సమూల మార్పు చోటు చేసుకుంటున్నది. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో 2024 పీకే -2 అనే గ్రహశకలం భూమి సమీపానికి వస్తోంది. ఇది ఒక చిన్నపాటి భవనం సైజులో ఉంది. గంటకు 31,380 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తోంది. భూమికి దాదాపు 12 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఇది ప్రయాణ సాగిస్తోంది. అటెన్ గ్రూప్ కు చెందిన ఈ గ్రహశకలం వల్ల భూమికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ.. సులువుగా తీసుకోవడానికి లేదు. ఒక గ్రహశకలం భూమికి సమీపంలోకి వచ్చింది అంటే.. ఆ తర్వాత ఇదే పరంపరలో మిగతావి కూడా వస్తాయి. అయితే వీటివల్ల ఎంత ప్రమాదం ఉందా అనేది ఇప్పుడు అంచనా వేయలేం. అలాగని అవి సాధారణంగా వచ్చే గ్రహశకలాలు అని చెప్పలేం. కాకపోతే పరిస్థితిని అంచనా వేస్తున్నామని” నాసా ప్రకటించింది.
భూమికి చేరువలో గ్రహశకలం వస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోనే మిగతా అంతరిక్ష సంస్థలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అన్నింటికంటే నాసా అత్యంత అభివృద్ధి చెందిన అంతరిక్ష కేంద్రం కాబట్టి.. దాంతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నాయి. సమాచారాన్ని పంచుకుంటున్నాయి. అయితే భూమికి సమీపానికి గ్రహశకలం వస్తున్న నేపథ్యంలో వివిధ అంతరిక్ష సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అయితే ఈ గ్రహశకలాన్ని టెలిస్కోప్ ద్వారా చూడడం సాధ్యం కాదు. ప్రత్యేకమైన శాటిలైట్ పంపించే చిత్రాల ద్వారా మాత్రమే ఇది బయట ప్రపంచానికి తెలుస్తుంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More