Reusable Rocket: రాకెట్ ను నింగిలోకి పంపించినప్పటికీ.. తిరిగి భూమ్మీదికి తీసుకురావచ్చు.. మనదేశంలో వినూత్నప్రయోగం

అంతరిక్షంలో చోటుచేసుకుంటున్న మార్పులను పరిశీలించేందుకు వివిధ ఉపగ్రహాలను ఎప్పటినుంచో రాకెట్ల ద్వారా పంపిస్తున్నారు.. అయితే నిర్దేశించిన కక్ష్య లోకి రాకెట్ వెళ్ళిన తర్వాత.. అది శకలాలుగా పడిపోతుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 23, 2024 8:36 pm

Reusable Rocket

Follow us on

Reusable Rocket: ఇలా రాకెట్ శకలాలు పడిపోయి అంతరిక్షంలో చెత్తాచెదారం పేరుకు పోతోంది. అయితే ఇప్పటివరకు ఈ సమస్యకు ఏ దేశం కూడా పరిష్కార మార్గం చూపించలేకపోయింది. అయితే ప్రపంచంలో తొలిసారిగా ఈ సమస్యకు పరిష్కార బాధ్యతను భారత్ ఎత్తుకుంది. ఉపగ్రహాలను తీసుకెళ్లే రాకెట్లు శకలాలుగా మారిన తర్వాత.. వాటిని తిరిగి అత్యంత జాగ్రత్తగా సేకరించి.. మరోసారి ప్రయోగానికి సిద్ధం చేసే సాంకేతికతను భారత్ తయారుచేస్తోంది. దీనికి చెన్నై వేదికగా మారింది.. ఈ క్రమంలో ఆగస్టు 24, శనివారం చెన్నైలోనే ఈ సి ఆర్ తిరువి దండై అనే తీర గ్రామం నుంచి “రూమీ -1” పేరుతో ఒక చిన్న రాకెట్ ను ప్రయోగించనున్నారు. అయితే ఇది దేశంలోనే తొలిసారిగా పునర్వినియోగించిన తర్వాత ప్రయోగిస్తున్న హైబ్రిడ్ రాకెట్ కావడం గమనార్హం. దీనిని హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్ పాడ్ పై నుంచి పంపిస్తున్నారు.. దీని బరువు దాదాపు 80 కిలోల దాకా ఉంటుంది.

స్పేస్ జోన్ ఇండియా సంస్థ ఈ రాకెట్ ను రూపొందించింది. అంతరిక్షంలో శకలాలు విపరీతంగా పేరుకుపోతున్న ప్రస్తుత తరుణంలో.. ఇంధనం మినహాయించి మిగతా రాకెట్ ను సురక్షితంగా భూమి మీదకు తీసుకువచ్చి.. మళ్లీ వినియోగించే విధంగా మిషన్ రూమీ -2024 ను తయారుచేశామని స్పేస్ జోన్ ఇండియా సంస్థ చెబుతోంది.. శనివారం ప్రయోగించే హైబ్రిడ్ రాకెట్ లో కిలో బరువు కంటే తక్కువ ఉన్న మూడు క్యూబ్ ఉపగ్రహాలు, అంతకంటే తక్కువ బరువుతో ఉన్న 50 షికో ఉపగ్రహాలు ఉన్నాయి. క్యూబ్ ఉపగ్రహాలతో గాలి నాణ్యత, యు వి రేడియేషన్, కాస్మిక్ రేడియేషన్, వాతావరణ పరిస్థితులు, గాలి నాణ్యతను సేకరిస్తారు.. నింగిలో కంపన స్థాయి , ఓజోన్ పొర పరిస్థితి, ఇతర పర్యావరణ పరిస్థితులను గుర్తించేందుకు షికో ఉపగ్రహాన్ని వాడుతున్నారు.

రూమీ -1 వినియోగిస్తున్న సాంకేతికత చాలా విభిన్నంగా ఉంది. ఒక విమానం పైకి ఎగిరి.. ఆ తర్వాత ఎలాగైతే భూమికి వస్తుందో.. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని రూమి -1 కోసం వినియోగిస్తున్నారు. కంటైనర్ లాంటి మొబైల్ లాంచ్ పాడ్ నుంచి ఈ రాకెట్ ప్రయోగిస్తున్నారు. ఆ తర్వాత కక్ష్యలోకి ఉపగ్రహాలు వెళ్లే విధంగా రాకెట్ పైకి ప్రయాణం సాగిస్తుంది. అక్కడికి వెళ్లే లోపు శకలాలు మళ్లీ భూమి మీదికి వచ్చేలాగా రాకెట్లో పారాచూట్ లు ఏర్పాటు చేస్తారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆశకులాలు కిందకు జారుతాయి. భూమికి కొంత ఎత్తుకు వచ్చిన తర్వాత పారా చూట్ లు తెచ్చుకొని సురక్షితంగా దిగుతాయి.. ఈ శకలాలను సెన్సార్ల సహాయంతో సేకరించి.. మళ్లీ మరో రాకెట్ ఉపయోగానికి వినియోగిస్తారు.