https://oktelugu.com/

Life Balance: జీవితమంటే ఇతరులతో పోటీ కాదు.. ఎవరికి నచ్చిన దారుల్లో వాళ్లు కొనసాగించే ప్రయాణం

ఈ ప్రపంచంలో ఎవరూ కూడా లైఫ్‌ను పూర్తిగా ఆస్వాదించలేరు. అయితే జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే మనం రోజూ మూడు రకాల సంపదను తప్పకుండా పెంచుకోవాలని రచయిత మార్క్ మాన్సన్ అంటున్నారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 23, 2024 / 09:27 PM IST

    Life Balance

    Follow us on

    Life Balance: చాలామందికి జీవితమంటే పుట్టామా, పెరిగామా, చదివామా, ఉద్యోగం చేస్తున్నామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లలను కన్నామా.. అన్నట్లు ఉంటారు. కానీ అందరికీ ఇదే లైఫ్ కాదు. కొందరికి వాళ్లు సాధించాలనే గోల్ ఉంటుంది. ఇది లైఫ్ అన్నట్లుగా ఉంటారు. జీవితానికి అర్థాలు చాలామంది వేర్వేరుగా చెబుతుంటారు. అయితే ఫర్‌ఫార్మెన్స్ కోచ్ జెస్సికా హేలీ మాత్రం.. జీవితమంటే ఇతరులతో పోటీ కాదంటున్నారు. ఎవరికి నచ్చిన దారుల్లో వాళ్లు కొనసాగించే ముఖ్యమైన ప్రయాణమని ఆమె అంటున్నారు. మీ మీద మీకు ఆత్మవిశ్వాసం ఉండటం ముఖ్యమే. కానీ ఆత్మవిశ్వాసం అంటే ఇతరుల కన్నా మీరే గొప్పగా ఉన్నారని భ్రమలో ఉండటం కాదు. అసలు ప్రపంచంలో ఎవరితో కూడా మీరు పోల్చుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకోవడమే ఆత్మవిశ్వాసం అని ఫర్‌ఫార్మెన్స్ కోచ్ జెస్సికా హేలీ అన్నారు.

    లైఫ్‌లో ఇవి సంపాదించుకోండి
    ఈ ప్రపంచంలో ఎవరూ కూడా లైఫ్‌ను పూర్తిగా ఆస్వాదించలేరు. అయితే జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే మనం రోజూ మూడు రకాల సంపదను తప్పకుండా పెంచుకోవాలని రచయిత మార్క్ మాన్సన్ అంటున్నారు. ప్రతి మనిషి తప్పకుండా శారీరక, మేధో, ఆధ్యాత్మిక సంపదను తప్పకుండా పెంచుకోవాలి. శారీరక సంపద అంటే వ్యాయామం, నడక, పరిగెత్తడం, ఆటలు, ఈత కొట్టడం వంటివి తెలుసుకుండాలి. మేధో సంపద అంటే పుస్తకాలు చదవడం, రాయడం, తన కలను ప్రయత్నించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేయాలి. అలాగే ఆధ్యాత్మిక సంపద అంటే ప్రార్థన, ధ్యానం, సేవ చేయడం, ఇతరులకు సాయం చేయడం వంటివి అలవర్చుకోవాలని రచయిత మర్క్ మాన్సన్ అంటున్నారు.

    వీటిని వదిలేయడం మంచిది
    ఏదైనా పని ప్రారంభిస్తే వెంటనే చేసేయాలి. రేపు చేద్దాంలే అని పెండింగ్‌లో పెట్టకూడదు. మనిషికి అసలు బద్దకం ఉండకూడదు. ఉంటే మనం కన్న కలలు చచ్చిపోతాయని వ్యాపారవేత్త నావల్ రవికాంత్ అన్నారు. అహంకారం ఎదుగుదలను ఆపేస్తే.. భయం కలలను చెరిపేస్తుంది. అనుమానం ఆత్మవిశ్వాసాన్ని పొగోడుతుంది. అసూయ మనకు ప్రశాంతత లేకుండా చేస్తే కోపం వివేకాన్ని అంతం చేస్తుంది. వీటిన్నింటిని తప్పించుకోవడం కేవలం మీ చేతుల్లోనే మాత్రమే ఉంటుందని వ్యాపారవేత్త నావల్ రవికాంత్ అన్నారు.

    ఏ పని చేసిన బెస్ట్‌గా చేయండి
    కొంతమందికి పనిచేసే సామర్థ్యం ఉన్నా చేయరు. వాళ్లకి ఇచ్చిన పని మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఎక్కువ వర్క్ చేసిన శాలరీ ఏం ఎక్కువ ఇవ్వరు కదా అనే భావనలో ఉంటారు. దీనివల్ల వాళ్ల టాలెంట్ బయట పడదు. మీరు ఎవరూ చేయని పనిని కొత్తగా చేస్తేనే ఈ ప్రపంచం గుర్తిస్తుంది. లేకపోతే మీరు ఎప్పటికీ కింద స్థాయిలోనే ఉండిపోతారు. కాబట్టి ఏ పని అయిన బెస్ట్‌గా చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే మీలోని టాలెంట్ బయటకు వచ్చి మీకు పదోన్నతులు అందుతాయని యోగా శిక్షకులు బి.ఎస్. గుప్తా అంటున్నారు.