https://oktelugu.com/

Balakrishna Bobby Movie: బాలయ్య బాబీ మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్న మలయాళం స్టార్ హీరో…

తెలుగులో నందమూరి ఫ్యామిలీకి మంచి గుర్తింపు అయితే ఉంది. ఈ క్రేజ్ తోనే వాళ్ళు వరుస సినిమాలను చేస్తు మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 23, 2024 / 08:31 PM IST

    Balakrishna Bobby Movie

    Follow us on

    Balakrishna Bobby Movie: సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తనదైన రీతిలో మంచి సినిమాలను చేస్తూ గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కూడా ఎదిగాడు. అలాగే వాళ్ల నాన్న అయిన ఎన్టీయార్ స్టార్ డమ్ ను ముందుకు తీసుకెళ్తూ నందమూరి ఫ్యామిలీ ని అలరిస్తూ వస్తున్నాడు. ఇక ఆయన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్న ఆయన బాబి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ ని ఇంకా రివిల్ చేయనప్పటికీ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇంతకు ముందు బాలయ్య బాబు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేసిన ‘వీర సింహారెడ్డి’ సినిమా భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా బాలయ్య బాబు కెరియర్లో ఒక మంచి హిట్ గా మిగిలిపోయింది.

    అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్ చేసిన ‘భగవత్ కేసరి’ సినిమా కూడా చెరగని ఒక ముద్రను వేసుకోవడమే కాకుండా వరుసగా మూడు సినిమాలతో సక్సెస్ ని అందుకున్న సీనియర్ హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాబి బాలయ్య తో చేస్తున్న ఈ సినిమాలో ఒక కీలక క్యారెక్టర్ ఉందట. అయితే ముందుగా ఆ క్యారెక్టర్ కోసం తెలుగులో ఉన్న కొంతమంది నటులను సంప్రదించినప్పటికీ వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆ పాత్ర కోసం మలయాళం స్టార్ హీరో ఆయన మోహన్ లాల్ ని రంగంలోకి దింపబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

    ఇక మోహన్ లాల్ ఇప్పటికే తెలుగులో జనతా గ్యారేజ్, మనమంతా లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి సినిమా ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో చూపించుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే మోహన్ లాల్ కంప్లీట్ యాక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు తో పాటు గా మోహన్ లాల్ క్యారెక్టర్ కూడా చాలా వైల్డ్ గా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఆయన కనిపించేది తక్కువ నిడివి అయినప్పటికీ అతనికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే అందుతున్నాయి.

    ఇక బాలయ్య బాబు బాబీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే బాలయ్య కెరియర్ లో వరుసగా నాలుగో సక్సెస్ ని అందుకున్న హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు… ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు బోయపాటితో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు జరుపుకోబోతుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…