Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీMicrosoft Surface For Business 2026: వ్యాపారుల కోసం Microsoft నుంచి Surface for Business...

Microsoft Surface For Business 2026: వ్యాపారుల కోసం Microsoft నుంచి Surface for Business లాంచ్.. ధర ఎంతంటే..

Microsoft Surface For Business 2026: బిజినెస్ చేసేవారికి మైక్రోసాఫ్ట్ కొత్తగా Surface for Business (2026) అనే ల్యాప్ టాప్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్‌లో Surface Pro for Business, Surface Laptop for Business మోడళ్లతో పాటు కొన్ని కాన్ఫిగరేషన్లలో Intel Core Ultra X7 వరకు ఆప్షన్ ఇస్తోంది, ముఖ్యంగా AI పనితీరు, ప్రొడక్టివిటీ కోసం వీటిని రూపొందించారు. దీంతో ఆప్ గ్రేడ్ ల్యాప్ టాప్ కోసం ఎదురుచూసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇందులో ఉండే ఫీచర్స్ ఏంటో చూద్దాం..

మైక్రోసాఫ్ట్ గతంలో బిజినెస్ Surface డివైజ్ ల గురించి ప్రకటించింది. ఇందులో భాగంగా కొత్తగా లాంచ్ చేసిన సిరీస్‌లో Intel Core Ultra Series 3 ప్రాసెసర్లతో పాటు ఎంపిక చేసిన మోడళ్లలో Intel Core Ultra X7 అప్ గ్రేడ్ ఆప్షన్ ఉంది. ఈ కొత్త ల్యాప్ టాప్ లు బిజినెస్ యూజర్లు, మల్టీటాస్కింగ్, ఆన్ డివైస్ AI ఉపయోగించేవారి కోసం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. Surface for Business (2026) ధరలు మోడల్‌ను బట్టి మారుతున్నాయి. 13 అంగుళాల డిస్ ప్లేతో కలిగిన Surface Laptop 1,499 డాలర్ల నుంచి ప్రారంభమవుతోంది. 3.8 అంగుళాలు, 15 అంగుళాల మోడళ్లు 1,949.99 డాలర్లతో విక్రయించే అవకాశం ఉంది. భారతదేశంలో కూడా ఈ సిరీస్‌కు సంబంధించిన లిస్టింగ్‌లు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మార్కెట్‌ను బట్టి ధరలు మారే అవకాశం ఉంది.

ఈ కొత్త Surface for Business మోడళ్లలో 13, 13.8, 15 అంగుళాల స్క్రీన్ ఆప్షన్లు ఉన్నాయి. మొదటి వేరియంట్ Laptop 16GB నుంచి 24GB వరకు ర్యామ్ సపోర్టు చేస్తుంది. ఇవి కొన్ని మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ తర్వాత 8GB వెర్షన్ కూడా రావచ్చు. వీటిల్లో Wi‑Fi 7, ఆన్-డివైస్ AI సామర్థ్యంతో పాటు కొన్ని మోడళ్లలో 5G కనెక్టివిటీ కూడా ఉన్నాయి. 13 అంగళాల మోడల్ లో 1,920 x 1,280 పిక్సెల్స్ డిస్‌ప్లే ఉండగా.. ఇది టచ్‌స్క్రీన్ తో పనిచేస్తుంది. ఈ ల్యాప్ టాప్ ఏదైనా సుమారు 1.24 kg బరువు ఉన్నట్లు చూపిస్తన్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular