https://oktelugu.com/

ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.25 వేలకే రూ.70 వేల ఫోన్…?

ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 70 వేల రూపాయల విలువ చేసే ఎల్జీ జీ8ఎక్స్ స్మార్ట్ ఫోన్ ను కేవలం 25 వేల రూపాయలకే విక్రయిస్తోంది. ఇతర ఈకామర్స్ సంస్థల ధరలతో పోల్చి చూస్తే ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆఫర్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ ఏకంగా స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై 62 శాతం డిస్కౌంట్ ను ఇస్తుండటం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 20, 2020 / 11:10 AM IST
    Follow us on


    ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 70 వేల రూపాయల విలువ చేసే ఎల్జీ జీ8ఎక్స్ స్మార్ట్ ఫోన్ ను కేవలం 25 వేల రూపాయలకే విక్రయిస్తోంది. ఇతర ఈకామర్స్ సంస్థల ధరలతో పోల్చి చూస్తే ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆఫర్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ ఏకంగా స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై 62 శాతం డిస్కౌంట్ ను ఇస్తుండటం గమనార్హం.

    దసరా పండుగ సమయంలో ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్లను ఇచ్చిన ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ నేపథ్యంలో నిర్వహిస్తున్న సేల్ లో భాగంగా ఈ ఫోన్ పై మరోసారి భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. కొత్త ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఆఫర్ వల్ల ప్రయోజనం చేకూరనుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో బ్లాక్ కలర్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

    పాత ఫోన్ ఉన్నవారు పాత ఫోన్ ను ఎక్స్ ఛేంజ్ చేసి కొత్త ఫోన్ ను కొనుగోలు చేసే సౌకర్యాన్ని కూడా ఫ్లిప్ కార్ట్ కల్పిస్తోంది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉండటంతో వీలైనంత త్వరగా ఫోన్ ను కొనుగోలు చేస్తే మంచిది. ఎక్స్ ఛేంజ్ ద్వారా ఏకంగా 13,200 రూపాయల వరకు పాత ఫోన్ ను బట్టి తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ డిస్ ప్లేతో పాటు అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.

    6.4 అంగుళాల డిస్ ప్లే, యాస్పెక్ట్ రేషియో 19.59, ఫుల్ హెచ్డీ + ఓఎల్ఈడీ డిస్ ప్లే ఈ ఫోన్ స్పెషిఫికేషన్లుగా ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ ను కలిగి ఉన్న ఈ ఫోన్ లో అవసరాలకు అనుగుణంగా సెకండ్ డిస్ ప్లేను ఉపయోగించుకోవచ్చు. ఫ్రంట్ కామ్ 12 మెగా పిక్సెల్ కాగా 13 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉండటం గమనార్హం. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉన్న ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జర్ ను సపోర్ట్ చేస్తుంది.