https://oktelugu.com/

ఎవరి లెక్కలు వారివి..

మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్‌ సీజన్‌ టైటిల్‌ పోరు జరుగబోతోంది. ఇంకొద్ది గంటల్లోనే టైటిల్‌ విన్నర్‌‌ ఎవరా అనేది తేలబోతోంది. 50 లక్షల ప్రైజ్‌ మనీ ఎవరి సొంతం కాబోతోందో స్పష్టం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల అభిమానులు మాత్రం ఎవరి లెక్కల్లో వారు మునిగిపోయారు. టైటిల్ విజేతగా ఎవరు నిలుస్తారన్న దానిపైనే రచ్చ నడుస్తోంది. అయితే.. వీరి లెక్కలు కూడా ఊహించని విధంగా మారిపోతున్నాయి. Also Read: చిన్న సినిమాకు పెద్ద గౌరవం ఈ నేపథ్యంలో ఒక్కో […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 20, 2020 / 11:02 AM IST
    Follow us on


    మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్‌ సీజన్‌ టైటిల్‌ పోరు జరుగబోతోంది. ఇంకొద్ది గంటల్లోనే టైటిల్‌ విన్నర్‌‌ ఎవరా అనేది తేలబోతోంది. 50 లక్షల ప్రైజ్‌ మనీ ఎవరి సొంతం కాబోతోందో స్పష్టం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల అభిమానులు మాత్రం ఎవరి లెక్కల్లో వారు మునిగిపోయారు. టైటిల్ విజేతగా ఎవరు నిలుస్తారన్న దానిపైనే రచ్చ నడుస్తోంది. అయితే.. వీరి లెక్కలు కూడా ఊహించని విధంగా మారిపోతున్నాయి.

    Also Read: చిన్న సినిమాకు పెద్ద గౌరవం

    ఈ నేపథ్యంలో ఒక్కో కంటెస్టెంట్‌కు ఒక్కో విధంగా అభిమానులు ఉన్నారు. ఈ సమయంలో ఒక్కో కంటెస్టెంట్ ఫాలోవర్స్ తమ అభిమాన కంటెస్టెంటే విజేత అని చెప్పుకుంటున్నారు. ఇక.. అభిజిత్ ఫాలోవర్స్ అయితే ఏకంగా ఎవరు ఏమనుకున్నా సరే బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అభిజితే అని డిక్లేర్ చేసేసుకుకుంటున్నారు.

    Also Read: కేజీఎఫ్ 2 అప్డేట్: అభిమానులకి డిసెంబర్‌ 21న గుడ్ న్యూస్

    ఇన్నాళ్లు భారీ ట్రెండ్స్ తో ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్‌కు లేని సంచలన రికార్డులు అందించారు. అలాగే మొదటి నుంచీ ఓటింగ్‌లో కూడా అభిజిత్ స్థిరంగా టాప్ స్థానంలోనే ఉన్నాడని టాక్ కూడా ఉంది. మరి ఇప్పుడు వీరు చెప్తుంది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అన్నది నేడే తేలిపోనుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్